Editor Voice

  • మంచినీళ్ళ పర్యంతం

     మీరు గమనించారో లేదో గాని, మన ఊర్లో ఒక విశేషం ఉంది. ఊరి మధ్యలో ఉన్న నూతులలోను పంపులలోనూ వచ్చే నీళ్ళు ఉప్పగా ఉంటాయి. నీళ్ళు కావాలంటే ఊరి బయట ఉన్న పంపులలోనో బావుల్లోనో మాత్రమే పడతాయి. బహుశా పూర్వం మనది ఓడరేవు అవటం, సముద్రం ప్రస్తుతం ఉన్న జలదీశ్వరాలయం వరకు ఉండేది అని చరిత్ర చెప్పటం కూడా దీనికి కారణమేమో. నా చిన్నపుడు తాగేనీళ్ళ కోసం అందరూ కావిడి భుజాన వేసుకుని ఊరికి బయట పెద్దగూడెం దగ్గరున్న చేతిపంపు దగ్గరికి వెళ్ళేవాళ్ళు.

    . ...readmore

  • గుండేరు గుండెచప్పుడు

     ఎందరిని ఏ దరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదా నావ అంటాడో సినీ కవి. నావలే కాదు మనల్ని దరికి చేర్చే వారధులు కూడా ఒంటరివే. ఏదైనా పొరపాటు జరిగిపోయి అయ్యో ఇప్పుడేం చెయ్యాలి అని ఎవరైనా అడిగితే మన నోటి వెంట వచ్చేవి రెండు మాటలు.తూరుపు తిరిగి దణ్ణం పెట్టు,ఎక్కడన్నా ఏట్లో దూకు.కానీ మన ఊర్లో మాత్రం కొంచెం మసాలా జోడించి గుండేట్లో దూకు అంటారు. ఇది చిన్నపుడు చాలాసార్లు చాలామంది అంటుండగా విన్నమాట. మన గ్రామస్తుల జీవితంలో మనం పెరిగిన పరిసరాల్లో గుండేరు ఒక విడదీయలేని భాగం.

    . ...readmore

  • శ్రీ ఆంజనేయం

     ఈ మధ్య ఎక్కువగా దేవాలయాల గురించే కధనాలు, వార్తలు వెబ్ సైట్ లో వస్తున్నాయని కొంతమంది మిత్రులు, (కంప్లైంట్ కాదు కానీ) వారు గమనించిన అంశం నా దృష్టికి తీసుకొచ్చారు. వారలా అనటంలో ఔచిత్యం ఉంది. ప్రతి వారం రాయటానికి కూర్చుంటే అన్నీ ఇలాంటి అంశాలే నా మది లో మెదులుతున్నాయి. నేను బొత్తిగా నాస్తికుడిని అని వాళ్ళ నమ్మకం. కానీ సామాజిక భాధ్యత తో మొదలు పెట్టిన ఈ వెబ్ సైట్ లో వ్యక్తిగత అభిప్రాయాలకి, స్వోత్కర్ష కి తావు లేదు. ప్రజాభిప్రాయాలు,వారు ఆసక్తి చూపిస్తున్న అంశాలను వెలుగు లోకి తీసుకు రావటం మా భాధ్యత. గత వారం చెప్పినట్లు వేణుగోపాల స్వామి ఆలయం లోకి మొదటి సారి ఈ వెబ్ సైట్ కి అవసరమైన ఫోటో తీసుకోవటానికి వెళ్ళినపుడు నేను చూసిన మరో ఆలయం ఆంజనేయస్వామిది.

    . ...readmore

  • ఈ పిల్లాడికి పెళ్లవుతుందా ???

     ఈ పిల్లకి పెళ్లవుతుందా?? 1983 లో రాజేంద్రప్రసాద్ హీరో గా వచ్చిన ఓ సినిమా టైటిల్ ఇది.
    కాలం మారింది. ఇపుడు రాబోయే టైటిల్ ఈ పిల్లాడికి పెళ్లవుతుందా ?? మీరు చదివేది నిజమే

    అప్పుడు వరకట్న సమస్య,ఇప్పుడు ఏకంగా అమ్మాయిలే కొరత.వరకట్నానికి,కన్యాశుల్కానికి మధ్య స్థితి లో ఉన్నాం మనం. ప్రపంచీకరణ ప్రభావం అన్నిటిమీద పడినట్లే భారత దేశం లోనే అతి పెద్ద టర్నోవర్ కలిగిన వివాహా పరిశ్రమ మీద కూడా పడింది.
    . ...readmore

  • నల్ల గుడి

     ఒకే వీధిలో పదిమంది డాక్టర్లు ఉన్నా,ఒక డాక్టర్ దగ్గరకే జనాలంతా క్యూ కడతారు.ఎందుకు అని అడిగితే అయన హస్త వాసి మంచిదండీ అని సమాధానం చెప్తారు. ఇది శాస్త్ర పరమైనది, మనిషి మేధస్సుకి సంభందించినది కాబట్టి ఈ వాదం లో కొంత వాస్తవాన్ని విస్మరించలేం. కానీ భగవంతుడు ఒక్కడే,ఎందెందు వెతికినా అందందే కలడు అనే వాదం కూడా శాస్త్ర పరమైనదే. కానీ మనం నమ్మం.దానికి ఉదాహరణ తిరుపతి పుణ్యక్షేత్రం.వేంకటేశ్వరుడు దేశం లో కొన్ని వేల దేవాలయాల్లో కొలువై ఉన్నాడు. కానీ అందరం తిరుపతికే వెళ్తాం.అక్కడున్న దేవుడు మాత్రమే మన కోరికలని తీరుస్తాడని నమ్ముతాం.

    . ...readmore

  • పెద్దలకి మాత్రమే

     ఆ మధ్య పెద్దలారా మన్నించండి కాలమ్ రాసాక చాలా మంది నన్ను అభినందించారు. పెద్దల పట్ల మనం చూపిస్తున్న నిరాదరణకి అద్దం పట్టినట్లుంది అని. కానీ నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి అంశానికి రెండవ పార్శ్వం కూడా ఉంటుంది. కమల్ హాసన్ నటించిన విరుమాండి (తెలుగు లో పోతురాజు) సినిమా చూడండి, ఒకే కధని హీరో చెప్తున్నపుడు ఒకలాగా, విలన్ చెప్తున్నపుడు మరోలా ఉంటుంది. ఎవరికి వారికి తమ కోణం లో చూస్తే తాము చేసేది కరెక్ట్ గానే కనిపిస్తుంది.

    . ...readmore

  • సామాన్యుడి సవారి-నేడు ఎక్కేవారేరి?

    బస్సు చక్రం ప్రగతి కి చిహ్నం, ఇది R.T.C వారి ప్రకటనల్లో తరచూ కనిపించే, వినిపించే పదం. ఆ పదాన్ని ఆ సంస్థ  ఎందుకు వాడుతుందో నాకు తెలియదు కానీ ఆర్టీసి బస్సు చక్రం గ్రామం లో తిరిగిందంటే అది ఆ గ్రామ ప్రగతికి చిహ్నం అని మాత్రం తెలుసు. పల్లె పల్లెనా ఆర్టీసి అంటూ ఒకప్పుడు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలనే ధ్యేయంతో గ్రామణి పేరిట ఆర్టీసి పలు గ్రామాలకి సర్వీసులని ప్రారంభించింది. దాదాపు 50 ఏళ్ళకి ముందు నుంచే మన గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది.

    . ...readmore

  • చారిత్రక ఆనవాళ్ళు

    ఈ వెబ్ సైట్ మొదలు పెట్టాక చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న, చరిత్ర మీద ఇంత అవగాహన ఎలా వచ్చింది అని. గ్రామానికి సంభందించిన భౌగోళిక పరమైన అవగాహన ఈ సైట్ మొదలు పెట్టేవరకు నాకూ లేదు. సాంఘిక చరిత్ర మీద మాత్రం మంచి అవగాహన ఉండేది. దానికి కారణం ఇంతకుముందు గుడి ముందు ఉన్న గొర్రెపాటి రంగన్న,వేమూరి రామన్న కళా మందిరం. చరిత్రకి సంబంధించినంత వరకు నేను అడిగిన తొలి ప్రశ్న ఎవరా రంగన్న,ఎవరా రామన్న? అలా అడిగింది వేమూరి వెంకట కృష్ణయ్య గారిని. 1993 లో గ్రామపంచాయితీ 75 సంవత్సరాల పండుగ వజ్రోత్సవాలని అప్పటి గ్రామ సర్పంచ్ సంకా నాగబాలసుబ్రహ్మణ్యం ఆనాటి కలెక్టర్ రాజీవ్ శర్మ ముఖ్య అతిధిగా ఇదే వేదిక మీద నిర్వహించారు.

    . ...readmore

  • ప్రజాస్వామిక నియంతృత్వం

    ఈ అంశం మన గ్రామానికి, అలాగే ఈ వెబ్ సైట్ ఉద్దేశానికి సంబంధించినది కాదు.నాకు తెలిసిన కొన్ని అంశాలని, అభిప్రాయాలని మీతో పంచుకోవాలనే ప్రయత్నమే తప్ప ఇది నా స్వోత్కర్ష గా భావించవద్దని మనవి. ఇటీవల జాతీయ అంతర్జాతీయ వార్తా సాధనాలన్నీ లిబియా దేశపు నియంత మహమ్మద్ గడాఫీ మరణాన్ని ప్రముఖం గా ప్రసారం చేశాయి. ఆ వార్త ఎవరికి ఖేదమో ఎవరికి మోదమో నాకు తెలీదు కానీ, నన్ను మాత్రం తీవ్రం గా భాదించిన సంఘటన అది. 2005 నుంచి 2007 వరకు ఉద్యోగ రీత్యా నేను దుబాయి లో ఉన్నాను. అప్పటికి అసలు బయట ప్రపంచం అంటేనే తెలీని వయసు నాది.

    . ...readmore

  • నాన్నా, తాత పేరేంటి?

    మీ తండ్రి పేరేంటి అనగానే ఠక్కున చెప్పేస్తాం, తాత పేరు అనగానే కొంచెం తడుముకున్నా వెంటనే చెప్తాం. మరి ముత్తాత పేరు? కష్టం కదా ! చాలా కష్టం ఇక ముందు ముందైతే తాత పేరు చెప్పటం కూడా కష్టమే. ఇటీవలే నేనొక వివాహానికి హాజరైనపుడు అప్పటిదాకా నేను చూడని వాళ్ళు, కేవలం వెబ్ సైట్ ద్వారానే నన్ను ఎరిగిన వారు కలిసినపుడు వెబ్ సైట్ లో ఉన్న పలు అంశాల గురించి చర్చించారు. వాటిలో ముఖ్యమైనది వంశ వృక్షాలు. ఓ పెద్దాయన చెప్తూ ఇటీవల పల్నాటి వంశస్తులు 11 వ శతాబ్దం నుంచి తమ వంశ వృక్షాన్ని తయారు చేసుకున్న సంగతి ప్రస్తావించారు.

    . ...readmore

  • స్నేహ సుమాంజలి

    ఆయనేమీ రాజకీయనాయకుడు కాదు, కేవలం తన స్నేహితులకి  స్నేహ మాధుర్యాన్ని, ఆత్మీయులకి అచంచలమైన ప్రేమానురాగాలని పంచిన ఒక సామాన్యమైన వ్యక్తి. రోడ్డు ప్రమాదం లో మధు మనకి దూరమై నేటికి పదిహేనేళ్ళు. అయినా తమ స్నేహితుడిని మర్చిపోలేని కొంతమంది యువకుల స్నేహ సౌశీల్యత కి రూపం క్రాంతి యువజన సంఘం. ఇన్ని సంవత్సరాలు గడచినా తమ స్నేహితుడి జ్ఞాపకాల్ని ఎప్పటికప్పుడు పదిలపరుస్తూ వాటికి మరిన్ని నూతన సొబగులు అద్దుతూ మంచి కార్యక్రమాలతో తమ స్నేహితుడిని అమరుడి గా నిలబెడుతున్నారు.

    . ...readmore