Editor Voice

  • డాక్టర్ యార్లగడ్డ యుధిష్టరనీడు

     ప్రముఖ వైద్యులు, మన రాష్ట్రంలో తోలి హార్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్ గా రికార్డు నెలకొల్పిన డాక్టర్ యార్లగడ్డ యుధిష్టర నీడు 17.01.2013 న కన్నుమూశారు. అయన వయస్సు 83 సంవత్సరాలు.భార్య నిర్మలా దేవి రెండు సంవత్సరాల క్రితమే కాలం చేసారు. ఈయనకి ముగ్గురు కుమార్తెలు,ఒక కుమారుడు.12.07.1930 న యార్లగడ్డ అంకినీడు,వెంకట రత్నమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించారు.తండ్రి అంకినీడు లాయర్.చల్లపల్లి రాజా గారికి బంధువులు.మనగ్రామానికి చెందిన కొండపల్లి చిట్టియ్య  గారి రెండవ కుమార్తె ని వివాహమాడటం ద్వారా ఈయన మన గ్రామం లో స్థిరపడ్డారు.గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారికి తోడల్లుడు.(చిట్టియ్య గారి మొదటి కుమార్తె ని బ్రహ్మ్మయ్య గారు వివాహం చేసుకున్నారు) భారతం లో ధర్మరాజు కి మారు పేరయిన  యుధిష్టర నామాన్ని కొడుక్కి పెట్టుకున్నా, అదే భారతాన్ని వ్యతిరేకించేవారు అంకినీడు

    . ...readmore

  • మూడేళ్ళ ముచ్చట్లు

     మూడేళ్ళ ప్రయాణం, మూడింతల సంతోషం. 2010 జనవరి 14 న ప్రారంభమైన ఈ ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలకి వేదిక అయ్యింది. అసలు వెబ్ సైట్ అనే పదాన్ని పలకటం రాక వెబి సైటు అని పిలిచే వెనకటి తరం చేతనే "ఆ డాట్ కామ్ లో పెట్టమని చెప్పండ్రా" అమెరికాలో అబ్బాయిలు చూస్తారు అనిపించింది ఈ మూడేళ్ళ ప్రయాణం. ఇదెన్నాళ్ళు నడుస్తుందిలే అనుకున్న వాళ్ళ చేత బాగా అప్ డేట్ చేస్తున్నారుగా అనిపించింది ఈ మూడేళ్ళ ప్రయాణం. ఊర్లో ఎవరైనా చనిపోతే ఫోన్ కాల్ కంటే ముందే తెలియచేసి, చాలా మందికి చనిపోయిన వారి ఆఖరి చూపుని అందించింది ఈ మూడేళ్ళ ప్రయాణం.వెబ్ సైట్ లో చనిపోయిన వారి సమాచారం తెలుసుకుని వారి బంధువులని పరామర్శించటానికి వెళ్ళిన వాళ్ళున్నారు.అరె మీకెలా తెలిసింది విషయం అని ఆశ్చర్యపోతే ఉందిగా మన ఊరి టివి 9 అనే సమాధానాలు చెప్పించింది ఈ మూడేళ్ళ ప్రయాణం.

    . ...readmore

  • తరాంతరం

     చాలా సందర్భాల్లో మనకంటే పెద్దవాళ్ళ దగ్గర తరచూ కొన్ని మాటలు వింటుంటాం.మా కాలంలో అయితేనా ఇలా ఉండేవాళ్ళం కాదు.అప్పుడు ఇన్ని తెలివితేటలు ఎక్కడ ఏడ్చాయి మాకు.ఆ పిచ్చి రోజుల్లో అదే గొప్ప. ఒకప్పుడు ఇలాంటి మాటలు అనేవాళ్ళకి అవి వినేవాళ్ళకి వినేవాళ్ళకి మధ్య వయసు వ్యత్యాసం 20 సంవత్సరాలు ఉండేది.అంటే ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య అంత కాల దూరం అన్నమాట. ఇప్పుడు కూడా అలాంటి మాటలు వినబడుతున్నాయి,కాని ఆ అనేవాళ్ళకి అవి వినేవాళ్ళకి మధ్య వ్యత్యాసం కేవలం మూడు  సంవత్సరాలు.కాలం ఎంత వేగంగా మారిపోతోంది అనేదానికి ఉదాహరణలెన్నో మన దైనందిన జీవితం సునిశితంగా గమనిస్తే మనకి అవగతమవుతాయి.

    . ...readmore

  • గ్రహానుగ్రహం

     మంత్రాలకి చింతకాయలు రాలతాయా అనే వాళ్ళలో నేను కూడా ఒకడినే. కష్టం వచ్చినపుడు తప్ప మామూలు సమయాల్లో దేవుడిని తలుచుకోని స్వార్ధజీవుల్లో నాక్కూడా స్థానం ఉంది. జ్యోతిష్యాన్ని, దేవుడి మహిమల్ని అస్సలు నమ్మని వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎప్పుడో అమ్మతో పాటు లేక బంధువులతోనో గుడికి వెళ్ళటం తప్ప, నా అంతట నేను సంకల్పించుకుని వెళ్ళిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. అలా అని నేను హేతువాదినో, కమ్యూనిస్టునో కాదు. మంచి జరిగితే నా గొప్ప, చెడు జరిగితే దేవుడి మీద తోసేసే అజ్ఞానులలో నేను కూడా ఒకడినే. కాని ఏదన్నా గుడికి చారిత్రక నేపధ్యమో లేక ఏదైనా వింత కలిగించే విషయం ఉంటే మాత్రం కల్పించుకుని మరీ వెళతాను. దైవ భక్తీ తో కాదు సుమా...ఆ చారిత్రక నేపధ్యాన్ని తెలుసుకోవాలనే ఆత్రుత,ఆ వింత మీద రంధ్రాన్వేషణ చేసి దానికి సైన్సుకి ఏమన్నా లింక్ ఉందేమో కనిపెట్టటానికి. 

    . ...readmore

  • అమ్మో ఘంటసాల అమ్మాయిలా ??

     ఇటీవలే ఒక మిత్రుడికి ఎదురైన అనుభవం ఇది.పాతికేళ్ళ క్రితం పాతుకుపోయిన భావాలు నేటికీ సజీవంగా ఉన్నాయనటానికి నిదర్శనం ఈ సంఘటన.సరదాగా చెప్పుకుంటే ఓ మిత్రుడు తనకి తెలిసిన అమ్మాయికి సంభంధం చూడటానికి తమ దూరపు బంధువులని సంప్రదించాడు. మంచి కుటుంబం, మంచి అమ్మాయి, అయినా సరే వాళ్ళనుంచి అతనికి ఎదురైన సమాధానానికి ఆశ్చర్యపోయాడు. అమ్మో ఘంటసాల అమ్మాయిలా ?? మనవాడికి అర్ధం కాలేదు. ఇదెప్పుడో పాతమాట. ఈ తరానికి బొత్తిగా తెలియని విషయం. ఆశ్చర్యం కాక మరేమిటి.

    . ...readmore

  • చేయూత లేని చేనేత

     మాకు దగ్గరి బంధువులంతా కొత్తపల్లి, కొడాలి, గుండుపాలెం ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారు. తరచుగా మా ఇంటికి రాకపోకలు ఉండేవి. వచ్చేటపుడు వారి స్నేహితులనో లేక బంధువులని కూడా తోడుగా తీసుకొచ్చేవాళ్ళు. అలా మా ఇంటికి వచ్చిన బంధువులంతా పొద్దునే వచ్చి కుశల ప్రశ్నలు, మంచి చెడ్డా మాట్లాడుకున్నాక సాయంకాలానికి నేత చీరలకోసం పద్మశాలీల దుకాణానికో లేక కొంతమంది నేత కార్మికుల ఇళ్ళకి చీరలు కొనటానికి వెళ్ళేవాళ్ళు. వాళ్లకి తోడుగా మా అమ్మ , తనకి తోడుగా నేను వారివెంట వెళ్ళిన జ్ఞాపకాలున్నాయి. అప్పుడు చాలా చిన్నతనం,ఆ చీరల నుంచి వచ్చే గంజి వాసన భలే ఉండేది. వాళ్ళు చీరలు చూస్తుంటే  నేను ఆ బేరాలు వింటూ ఉండేవాడిని. ఆ బేరాలు తెగేవి కాదు ముడి పడేవి కాదు. ఘంటసాల పురాతన గ్రామంగా ఎంత పేరు ఉందో,చేనేత వస్త్రాలకి అంతే పేరు ఉంది.

    . ...readmore

  • నిర్జనవారధి - II

     ఈ ఆత్మకదలో నాకు ఆసక్తి కలిగించిన మరో అంశం, మన గ్రామానికి చెందిన శ్రీ  వేమూరి నాగేశ్వరరావు, శ్రీమతి శాంతమ్మ దంపతులతో కోటేశ్వరమ్మ గారి అనుబంధం. ఇది చదువుతున్నపుడు, ఈ వెబ్సైట్ రూపకల్పనలో విషయ సేకరణ కోసం హైదరాబాదులో వేమూరి నాగేశ్వరరావు గారితో గడిపిన సాయంత్రాలు గుర్తొచ్చాయి. ప్రతి రోజూ సాయంత్రం ఆఫీసు అయిపోగానే వారింటికి వెళ్ళిపోయేవాడిని. 92 ఏళ్ళ  వయసులో కూడా నేను అడిగిన ప్రశ్నలకి ఎంతో వివరంగా చెప్పిన ఆయన ఓపికకి హాట్సాఫ్ అనిపించేది. వారి సతీమణి శాంతమ్మ గారు కొన్ని విషయాల్లో వారిస్తున్నా సరే ఆనాటి సంఘటనలని కళ్ళకి కట్టినట్లు వివరించేవారు. అలాగే కొందరు వంశస్తులు ఘంటసాలకి ఎలా వచ్చారనే ఆసక్తి కరమైన అంశాలు ఆయన దగ్గరే తెలుసుకున్నాను. తదనంతర కాలంలో నాగేశ్వరరావు గారు  వేమూరి వారి చరిత్ర పేరిట ఒక గ్రంధాన్ని కూడా వెలువరించారు.ఆ పుస్తకం ఇదే వెబ్సైట్ లో ఈ బుక్స్ లో చూడవచ్చు.

    . ...readmore

  • నిర్జనవారధి - I

     నాకు కొంచెం పుస్తకాల పిచ్చి ఎక్కువే. ఆత్మ కధలైతే ఆపకుండా చదివేస్తాను. ఆ ఆత్మ కధలు ఉద్యమాల నేపధ్యం అయితే అది నాకు మృష్టాన్న భోజనమే. ఈ మధ్య ఇంటర్నెట్లో ఈ - బుక్స్ రావటంతో నా పని మరింత సులువైంది. ప్రస్తుతం మావోయిస్టులు అనబడుతున్న వాళ్ళు ఒకప్పుడు నక్సలైట్లు గా పిలవబడేవారు. మన గ్రామంలో మేము 8,9 తరగతి చదివే రోజుల్లో హైస్కూల్ లో చదువుకునే విద్యార్ధులంతా పొద్దున, సాయంత్రం ప్రైవేటుకి వెళ్ళేవారు. సీతారామక్రిష్ణ గారు , శాస్త్రులు గారు ఫేమస్ ట్యూషన్ మాస్టర్లు. నక్సలైట్ ట్యూషన్ అని ఒకటి ఉండేది. అంటే ఆ ట్యూషన్ చెప్పే మాస్టారు ఒకప్పుడు నక్సలైట్ గా పనిచేసాడని చెప్పుకునేవారు. అలా ఆ పదం మొదటిసారి విన్నాను. అప్పట్లో T.V చానెల్స్ లేవు కాబట్టి న్యూస్ పేపర్స్ లోనే "నక్సలైట్ల పంజా" అని "పీపుల్స్ వార్ దాడి" అని తరచూ చదువుతూ ఉండేవాడిని.

    . ...readmore

  • ముందుచూపు

     కవి , తత్వవేత్త తమ కాలం కంటే ముందు ఉంటారనేది నిర్వివాదాంశం. మిగతా వాళ్ళంతా ఆ రెండూ కాదు కాబట్టి గతించిన కాలంలో జరిగిన మార్పుల్నిమాత్రం విశ్లేషిస్తూ ఉంటారు. ఇది ఒకరకంగా అలాంటి విశ్లేషణ. ఒక్క 20 సంవత్సరాలు వెనక్కి వెళదాం. గ్రామంలో గత ఇరవై సంవత్సరాల్లో మనం ఊహించనివి, భవిష్యత్తులో ఇలా కూడా అవుతుంది అని ఎవరూ ఏ మాత్రం అంచనా వెయ్యని కొన్ని సంఘటనలు, మార్పులు తలచుకుంటే నిజంగా ఆశ్చర్యమే. ఇది మన గ్రామానికే పరిమితం అని కాదు నా ఉద్దేశం.

    . ...readmore

  • మాసిపోతున్న జ్ఞాపకాలు

     ‘రాజు మరణించే ఒక తార రాలిపోయే.. కవి మరణించే ఒక తార గగణమెక్కే... రాజు జీవించే రాతి విగ్రహములందు.. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు’’ చిన్నపుడేపుడో చదువుకున్న గుర్రం జాషువా రాసిన పద్యం. ఇలా రాసిన కవి కూడా తదనంతర కాలంలో టాంక్ బండ్ మీద రాతి విగ్రహం రూపంలోనే కొలువుదీరాడు. పాపం ఆయనకి రాసినపుడు తెలియదు, ముందు తరాల వారికి తన విగ్రహాన్ని చూపిస్తే తప్ప తానెవరో తెలియదు అని. అప్పుడు కవి ప్రాముఖ్యం అలాంటిది.ఇప్పుడు రాజులే కాదు కవులు, 

    . ...readmore

  • ఎనీ టైం మనీ

     ATM వచ్చిన కొత్తల్లో ఎవరికి తగ్గట్లు వాళ్ళు దాని అర్ధాన్ని చెప్పేసే వాళ్ళు Any time money, All time money ఇలా రకరకాలుగా. చాలామందికి అది Auto Teller Machine అని తెలియదు. మన దేశంలో తొలి ఎ టి ఎమ్ 1987 లో ముంబై లో ఏర్పాటు అయ్యింది. ఆ ఘనతని దక్కించుకున్న తొలి బ్యాంక్ HSBC. నేను తొలిసారి ATM ని చూసింది సికింద్రాబాద్ లో సంగీత్ ధియేటర్ పక్కనున్న Global Trust Bank 1999 సంవత్సరం లో.

    . ...readmore