దేశమంతా స్వచ్ఛ భారత్ నినాదంతో మారుమోగుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం బాలికలకు మరుగుదొడ్లు లేకపోవటం స్వచ్ఛ భారతంలో విషాదం. దానికి మన హైస్కూల్ మినహాయింపు కాదు.మన హైస్కూల్ కట్టి 72 సంవత్సరాలు, ఇప్పటికీ మూత్ర విసర్జనకు బాలబాలికలు పడే ఇబ్బండులు చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది. ఇక తాగునీటి పరిస్థితి మరీ దారుణం. చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల లో ఉన్న హైస్కూల్స్ కంటే ఘంటసాలలో ఉన్న హైస్కూల్ లోనే విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు.ఇటీవల హెడ్ మాస్టర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు స్కూల్ లో ఉన్న సమస్యల గురించి వాటికి అవసరమైన సహాయం గురించి ప్రస్తావించారు. ఒక్కరే అన్నీ చెయ్యలేకపోయినా అందరం తలా ఒక చెయ్యి వేస్తె ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. పూర్వ విద్యార్థులు అందరూ పూనుకుంటే కనీసం బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించవచ్చు. సహాయం చేయదలచిన వారు సంప్రదించండి. Head Master Sri Pothana Venkateswararao - 9949988910
Dated : 02.03.2018