శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు గారు
ఘంటసాల గ్రామానికి చెందిన వ్యక్తి కాకపోయినా,ఘంటసాల గ్రామంతో రాజకీయంగానూ వ్యక్తిగతం గానూ విడదీయలేని అనుభంధం ఉన్న వ్యక్తి వేమూరి వెంకట కృష్ణారావు గారు. నేను ఆరవ తరగతి హైస్కూల్ లో చదువుకునేటప్పుడు స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధి గా వచ్చారు. ఆ సంవత్సరం నాకు ఇంగ్లిష్ లో ఫస్ట్ ప్రైజ్ రావటం తో ఆయన చేతులమీదుగా ఆ బహుమతిని అందుకున్న జ్ఞాపకాలు నాకున్నాయి.