తెలుగుదేశం రామకృష్ణ Back to list

 

 బాబూ ఈ ఊర్లో రామకృష్ణ గారి ఇల్లు ఎక్కడా ?

*_మా ఊర్లో వీధికొక రామకృష్ణ ఉన్నారు , మీకు ఏ రామకృష్ణ గారి ఇల్లు కావాలి ?_*

 వాళ్ళ ఇంటిపేరు గొర్రెపాటి , గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారు.

*_ఆ పేరుతో కూడా మా ఊర్లో ఐదుగురు ఉన్నారు. _*

 అదే బాబూ అయన టిడిపి పార్టీ లో ఉంటారు.

*_అలా చెప్పండి , అయన పేరు “తెలుగుదేశం” రామకృష్ణ. మా ఊర్లో పార్టీ పేరుని ఇంటి పేరు చేసుకున్న ఏకైక వ్యక్తి. తిన్నగా ఓ ఫర్లాంగు దూరం వెళితే ఎడమ చేతి వైపు ఉంటుంది ఇల్లు. _*

 

ఘంటసాలలో ప్రతి రోజూ ఈ పిలుపు వినిపిస్తూనే ఉంటుంది. శుభకార్యాలకి పిలుపు లైనా మంచి కి చెడుకీ పెద్దరికం వహించాలన్నా ఆయన పేరు “తెలుగుదేశం” రామకృష్ణ గానే జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది.

1982 లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యుడుగా గొర్రెపాటి వెంకటరామకృష్ణ అందరికీ సుపరిచితుడే. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ లో వుంటూ ఇంటి పేరుతో కన్నా పార్టీ పేరుతో " తెలుగుదేశం రామకృష్ణ " గా సార్ధక నామధేయుడు . 1983 లో గ్రామం నుండి నిమ్మకూరు వెళ్లి ఎన్టీఆర్ సమక్షంలో పార్టీ లో చేరిన రామకృష్ణ, నాటి నుండి నేటి వరకూ అదే పార్టీ సభ్యుడు గా విధేయుడు గా కొనసాగుతున్నారు. 1983-85 నిడుమోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆనాడు ఆయన స్వగ్రామం ఘంటసాల ఈ నియోజకవర్గం లోనే ఉండేది. తర్వాత 1985 -96 ఘంటసాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పని చేశారు.

 

ఒక ప్రముఖ దినపత్రిక యం.డి 1986 లో నారాచంద్రబాబు నాయుడు గారితో సమావేశంలో కృష్ణాజిల్లా రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినపుడు నా దృష్టిలో ఉన్న ముఖ్య నాయకుడు రామకృష్ణ అని చెప్పి ,కంప్యూటర్ లో వున్న లిస్టు లో అయన పేరు చూపించారట.

 

1995-2000 ఆయన సతీమణి శ్రీమతి మధుర మీనాక్షి ఘంటసాల మండల పరిషత్ MPP అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘంటసాల గ్రామం విచ్చేసి ITI కళాశాల కి శంఖు స్థాపన చేశారు. ఆ సందర్భంలో మీరిద్దరూ చాలా బాగా పనిచేస్తున్నారని దంపతులిద్దర్నీ అభినందించారు. అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ చిత్రా రామచంద్రన్ కూడా వీరి పని తీరుని గురించి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రశంసించటం విశేషం. ఆ తరువాత 2001-2006  కృష్ణాజిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఎంపిక చేశారు. అయన కృష్ణాజిల్లా వైస్ చైర్మన్ గా ఉన్నపుడే దలైలామా ని కలిసి ఘంటసాల బౌద్ధ స్థూపం గురించి అయనకి వివరించారు. తాను తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఊరుమ్మడి కార్యక్రమాల్లో ఘంటసాల గ్రామంలో అన్ని పార్టీ ల వారినీ కలుపుకుని వెళుతూ అజాత శత్రువు గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయన్ని తెలుగుదేశం రామకృష్ణ గా గౌరవిస్తారు.

 

1983 లో తెలుగుదేశం పార్టీ జన్మించినప్పటి నుండి అదే పార్టీ లో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల్లో ఒకడు గా వేలాది మంది నాయకులలో ఒకడిగా కూడా నిలబడ్డారు శ్రీ గొర్రెపాటి రామకృష్ణ. సారీ “తెలుగుదేశం” రామకృష్ణ.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక శ్రీ NTR శతజయంతి సంరంభములో తొలి తరం కార్యకర్తలని , నాయకులని తలచుకోవాల్సిన సందర్భం ఇది. వారిలో ఒకానొక ముఖ్యులు కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన  శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ.

#తెదేపాడెస్క్ #NTR100YEARS #ఎన్టిఆర్ శతజయంతి

 

This text will be replaced