Editor Voice

  • నందన కరువుకి 180 ఏళ్ళు

    . ...readmore

  • శ్రీ దోనేపూడి సీతారామయ్య

     కొంతమంది వ్యక్తులు తాము చేసే ప్రతి పనిలోనూ తమదైన ముద్ర వేస్తుంటారు. తాము ఎంచుకున్న రంగం లో మైలు రాయిలా నిలిచిపోయే పనులతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. మన గ్రామ పంచాయితీ విషయానికి వస్తే చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం,పంచాయితీ ఏర్పడి 94 సంవత్సరాలు. ఆ కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తే దోనేపూడి సీతారామయ్య గారికి ముందు మరియు ఆయన తర్వాత అని ప్రస్తావించాలి.

    . ...readmore

  • శ్రీ వేమూరి వెంకట నరసింహారావు

    . ...readmore

  • చిట్టియ్య గారి పాలవ్యాన్

     1996 వరకు మన ఊర్లో ప్రభుత్వ పాలకేంద్రానిదే హవా,అప్పటికి ఇంకా ప్రైవేటు డైరీలు లేవు. ఆ తర్వాత హార్లిక్స్ కొరకు పాలు అని ఓ కొత్త పాలకేంద్రం వెలసింది. ఇప్పుడు ఇంకా రెండు మూడు వచ్చాయనుకోండి. సరే ఇదంతా పాల కేంద్రాల విషయం. పదేళ్ళ క్రితం వరకు పొద్దున్నే ఏడుగంటలకి, సాయంత్రం ఏడుగంటలకి,1969 మోడల్ బెంజి లారీ తనదైన స్టైల్ లో హారన్ కొట్టుకుంటూ ఊర్లో ప్రవేశించేది. జనాలెవరూ తమ మెదడుకి పెద్ద మేత పెట్టకుండానే ఆ కూత దేనిదో ఇట్టే కనిపెట్టేసేవారు.

    . ...readmore

  • వేమూరి జగపతిరామయ్య గారు

     

    జగపతి రామయ్య గారిని 1999 లో మొట్టమొదటి సారి కలుసుకున్నపుడు ఆయన గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. వర్లు గారితో పాటుగా అయన కూడా ఓ కార్యక్రమానికి వచ్చినపుడు మన గ్రామానికే చెందిన వ్యక్తిగా మాత్రమే నాకు పరిచయం. ఇక ఆ తరువాత ఆయన నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించినా వెళ్ళలేకపోయాను.

     

    . ...readmore

  • ఉప్పల వెంకటేశ్వర్లు గారు

     యు వి వర్లు అనే పేరు మొట్ట మొదటిసారి విన్న సందర్భం నాకు ఇంకా గుర్తుంది. హైస్కూల్ లో చదువుకునేటప్పుడు ఏదో కార్యక్రమం నిమిత్తం ఆయన అతిధిగా వస్తారు అని. కానీ ఆ కార్యక్రమంలో నేను లేకపోవటం వల్లో ఏమో కానీ అప్పుడు ఆయనని చూడలేకపోయా. విన్నప్పుడు ఏంటి ఈ పేరు ఇలా ఉంది అనే సందేహం వచ్చి చూస్తే పూర్తి పేరుని అలా కట్ చేసి పిలుస్తున్నారని అర్ధం అయ్యింది. అయినా చక్కగా వెంకటేశ్వర్లు అనే పేరుని అలా కుదించటం ఎందుకో అప్పుడు నా చిన్ని బుర్రకి తట్టలేదు.

    . ...readmore

  • ఇద్దరు ఆత్మీయులు, ఒక నివాళి

     నా జీవితంలో అతి త్వరగా ప్రవేశించి అంతే త్వరగా నిష్క్రమించిన వ్యక్తులు వీళ్ళు. ఎదిగీ ఎదగని వయసులో ఆలోచనా విధానం అప్పుడప్పుడే పరిణతి చెందుతున్న దశలో నేనెక్కువ కాలం గడిపిన వ్యక్తి వేమూరి వెంకట కృష్ణయ్య తాత. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పటినుంచి ఇంటర్మీడియట్ అయ్యే వరకు మధ్య లో ఒక్క సంవత్సరం తప్ప ప్రతిరోజూ అయన చెప్పే కబుర్లు వినకుండా పడుకున్న సందర్భాలు తక్కువ. మన పూర్వీకుల మీద, గ్రామ చరిత్ర మీద ఆయనకున్న అవగాహన అమోఘం.

    . ...readmore

  • సమైక్యత వర్ధిల్లాలి

     మన ఊర్లో రాజకీయం చాలా విచిత్రమైనది అని చాలా మంది చెప్పటం విన్నాను తప్ప నాకు ప్రత్యక్షానుభవం లేదు. పార్టీ పరమైన విభేదాల వల్ల చాలా పనులు అవ్వలేదు.లేదా అనుకున్నంత బాగా చెయ్యలేకపోతున్నాం అని కొంతమంది పెద్దలు వాపోవటం విన్నాను. ఎదురు పడితే ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే చాలా మంది, పార్టీ విషయం వచ్చేటప్పటికి మాత్రం ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఎదుటి పార్టీ వారిపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి చూస్తుంటారు అనేది గ్రామం లో నానుడి.

    . ...readmore

  • అ'ద్వితీయం'

     అప్పుడే రెండేళ్ళు గడచిపోయాయి. అధికారికంగా వెబ్ సైట్ ని ఆవిష్కరించి రెండేళ్ళే అయినా, దీనికి పునాది పడి మూడేళ్ళు. దాదాపు సంవత్సరం పాటు సమాచార సేకరణకే వెచ్చించాల్సి వచ్చింది. ఏదైనా పక్కా ప్రణాళికతో, వ్యూహంతోనే రంగంలోకి దిగాలనేది నా అభిమతం. ఈ ప్రయాణంలో నాతో నడచిన మిత్రులు, సలహా దారులు లేకపోతే ఈ ప్రయాణం అసంపూర్ణంగానే ముగిసిపోయేదేమో. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పడిన కష్టం కనిపిస్తోంది తప్ప, రూపకల్పన చేసేటప్పుడు మాత్రం ఏనాడు కష్టమనిపించలేదు. ఏదో గొప్ప ఆశయం కోసమో, ఊరుని ఉద్ధరించేయాలి అనే ఆరాటంతో ఈ సైట్ పెట్టలేదు.

    . ...readmore

  • నందమూరి జ్ఞాపకాలు

    1982 దాకా మన గ్రామంలో ఉన్నవి రెండే పార్టీలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు. ఎన్ టి ఆర్ పార్టీ పెట్టాక కాంగ్రెస్ వాదులు పెద్దగా మారలేదు గాని, అప్పటికే కమ్యూనిజం బలహీనపడిపోతుండటంతో దాదాపు అదే భావజాలంతో పార్టీ పెట్టిన ఎన్ టి ఆర్ వైపు కమ్యూనిస్టులంతా ఆకర్షితులయ్యారు. ఎన్ టి ఆర్ మన గ్రామానికి రెండు సార్లు వచ్చారు. మొదటిసారి పార్టీ పెట్టినపుడు ఎన్నికల ప్రచారానికి 1982 లో, రెండో సారి మంచినీళ్ళ టాంక్ ప్రారంభోత్సవానికి.

    . ...readmore

  • గూడు నిదురపోవునా ?

     ఈ మధ్య ఊరికి వెళ్ళినపుడు కొన్ని పాత ఫోటోల కోసం కొన్ని ఇళ్ళకి వెళ్ళాను.అది కూడా రాత్రి ఏడు గంటల ప్రాంతం లో .అవన్నీ చిన్నపుడు నేను చూసిన ఇళ్ళు,అలాగే అందులో మనుషులు కూడా.కానీ అప్పుడున్న సందడి కానీ అంతమంది మనుషులు కానీ ఇప్పుడు లేవు.ఒకప్పటి మేడలన్నీ చిన్న పెంకుటిళ్ళుగా మారిపోయాయి.బిక్కు బిక్కు మంటూ ఒకళ్ళో,ఇద్దరో మనుషులు.ఇంటి చుట్టూ చీకటి.బయట నుండి నాలుగు సార్లు పిలిస్తే తప్ప బయటికి రాని పరిస్థితి.నా మనసు ఒక్క పదేళ్ళు వెనక్కెళ్ళింది.

    . ...readmore