ఈ పిల్లాడికి పెళ్లవుతుందా ???Back to list

ఈ పిల్లాడికి పెళ్లవుతుందా ???

 ఈ పిల్లకి పెళ్లవుతుందా?? 1983 లో రాజేంద్రప్రసాద్ హీరో గా వచ్చిన ఓ సినిమా టైటిల్ ఇది.
కాలం మారింది. ఇపుడు రాబోయే టైటిల్ ఈ పిల్లాడికి పెళ్లవుతుందా ?? మీరు చదివేది నిజమే 
అప్పుడు వరకట్న సమస్య,ఇప్పుడు ఏకంగా అమ్మాయిలే కొరత.వరకట్నానికి,కన్యాశుల్కానికి మధ్య స్థితి లో ఉన్నాం మనం. ప్రపంచీకరణ ప్రభావం అన్నిటిమీద పడినట్లే భారత దేశం లోనే అతి పెద్ద టర్నోవర్ కలిగిన వివాహా పరిశ్రమ మీద కూడా పడింది.

విద్యా రంగం లో గత కొన్నేళ్లలో అమ్మాయిలు సాధించిన ప్రగతి,వారికి మరింత ఆర్ధిక స్వేచ్ఛనిచ్చింది.ఇప్పుడు Requirements అబ్బాయిలకి కాదండోయ్. అమ్మాయిలకే నట. Demand & Supply ఒకే నిష్పత్తి లో లేనపుడు ఆ వస్తువు కి Demand సహజం కదా.అసలు ఈ టాపిక్ కి మన ఊరికి సంభంధం ఏమిటి అనుకుంటున్నారా?అక్కడికే వస్తున్నాం, మన ఊరి రచ్చబండ సమాచారం ప్రకారం 2010 చివరి నాటికి మన ఊరిలో 30 వ పడి లో అడుగుపెట్టనున్న యువకుల సంఖ్య 30  పైమాటే.ఆస్థి,అందం,మంచి ఉద్యోగం,నెలకి అయిదంకెల జీతం ఇవన్నీ ఉన్నా మనవాళ్ళకి తగ్గ అమ్మాయిలే దొరకట్లేదట.
ఒకప్పుడు పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంది అంటే అదో పెద్ద భారం అని భావించేవాళ్ళు.మరి నేడో, చదువుకుని జాబ్ చేస్తున్న అమ్మాయి ఇంట్లో ఉంది అంటే బొలెడంత డిమాండ్.ఇపుడెవర్ని కదిలించినా ఒకటే మాట" కట్నం దేముందిలే అమ్మాయి జాబ్ చేస్తూ మాలో కలిసిపోతే చాలు"ఇలా అన్నా అసలు అమ్మాయిలే దొరకనప్పుడు కట్నం సమస్యేముంది.ఇప్పుడున్న జనరేషన్ అంతా తమకు ముందున్న మూడు తరాల్ని చూడగలిగారు.కారణం,వాళ్లందరూ సరైన వయసులో పెళ్ళి చేసుకోవటం.తాము 50 వ పడిలోకి రాకముందే తమ పిల్లలకి పెళ్ళి చేసెయ్యటం.అందుకే మన ఊరిలో చాలా మంది తండ్రీ కొడుకులు అన్నదమ్ముల్లా కనిపిస్తారు తెలియని వాళ్ళకి.ఇక మన రాబోయే తరాలన్నీ  వాళ్ల పిల్లలకి తాతలని ఫోటొల్లో చూపించాల్సిందే.కొండెక్కి కూర్చున్న అబ్బాయిలంతా ఎప్పుడో దిగేశారు.తల్లి దండ్రులూ ఇక మీరూ కూడా దిగాల్సిందే.
 
 
Dated : 10.07.2010

This text will be replaced