Editor Voice

  • ఇద్దరు రత్నాలు

                                                              ఇద్దరు రత్నాలు  

     

    ఘంటసాలలో హరిజన దేవాలయ ప్రవేశం గురించి చదివినప్పుడల్లా నా మనసు ఎంతో ఉప్పొంగేది. కులవివక్ష ని ప్రేరేపించింది, అలాగే కుల వివక్ష కి వ్యతిరేకంగా పోరాటం చేసింది కూడా అగ్ర వర్ణాలనబడే ఆ సామాజిక వర్గాల వారే అవ్వటం నాకెప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగించేది.1933 లో దళిత నాయకుడు  శ్రీ వేముల కూర్మయ్య గారి ఆధ్వర్యంలో ఘంటసాలలో జరిగిన హరిజన దేవాలయ ప్రవేశ ఘట్టానికి నాయకత్వం వహించింది  శ్రీ ఘంటసాల లక్ష్మీ నరసింహం పంతులు , శ్రీ గొట్టిపాటి బ్రహ్మ్మయ్య , శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వంటి బ్రాహ్మణ , కమ్మ కులాలకి చెందిన పెద్దలే. 
     
    . ...readmore

  • ఆరుగాలం సేద్యం

     హేమంత కాలంలో ప్రారంభమై,అభినందనల వర్షంలో తడిచి,విమర్శల గ్రీష్మ తాపానికి ఎదురొడ్డి,శరత్కాల వెన్నెల్లో వీక్షకులకి విందు చేసి,ఆకురాలే శిశిరం నుండి,సరికొత్త ఆలోచనల వసంతాన్ని విరబూయిస్తూ సాగిస్తున్న ఈ సేద్యానికి ఆరువసంతాలు.ఈ ఆరు సంవత్సరాల్లో ఈ క్షేత్రంలో పండించిన పంటలు ఎన్నో

    . ...readmore

  • రవితేజ టిఫిన్ సెంటర్ పార్ట్ -2

     రవితేజ హోటల్ గుర్తుందా ? 1990 వ దశకంలోనే MLA దోశ MP దోశ అంటూ హడావుడి చేసిన నారాయణ గుర్తున్నారా? రవితేజ చికెన్ సెంటర్ , రవితేజ వైన్స్ అంటూ ఆనతి కాలంలోనే ఘంటసాల గ్రామంలో తారాజువ్వలా నింగికెగసి అంతే తొందరగా నేలను తాకిన అయినపూడి నారాయణ ఇప్పుడెక్కడున్నారు? రవితేజ హోటల్ కనుమరుగవటానికి కారణాలు ఏమిటి? స్థాపించిన కొద్ది నెలల్లోనే అత్యంత ప్రాచుర్యం పొంది, గ్రామ ప్రజల మనసును గెలుచుకున్న టిఫిన్ సెంటర్ ఎందుకు మూతబడింది? అసలు ఇప్పుడు నారాయణ ఏం చేస్తున్నారు? రవితేజ నారాయణ తో మనఘంటసాల ఎడిటర్ రాజేష్ వేమూరి ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..

    . ...readmore

  • రవితేజ టిఫిన్ సెంటర్

     ​​రవితేజ హోటల్ గుర్తుందా ? 1990 వ దశకంలోనే MLA దోశ MP దోశ అంటూ హడావుడి చేసిన నారాయణగుర్తున్నారారవితేజ చికెన్ సెంటర్ రవితేజ వైన్స్ అంటూ ఆనతి కాలంలోనే ఘంటసాల గ్రామంలో తారాజువ్వలా నింగికెగసి అంతే తొందరగా నేలను తాకిన అయినపూడి నారాయణ ఇప్పుడెక్కడున్నారురవితేజ హోటల్ కనుమరుగవటానికి కారణాలు ఏమిటి?

    . ...readmore

  • స్వచ్ఛ నాయకుడు

    నేను ప్రతి రోజు ఫేస్ బుక్ ఓపెన్ చెయ్యగానే నా న్యూస్ ఫీడ్ లో మసక చీకట్లో చీపుర్లు , పారలు పట్టుకుని కొంతమంది రోడ్లు శుభ్రం చేస్తున్న ఫోటోలు ప్రత్యక్షమవుతుంటాయి. మొదట్లో నలుగురైదుగురు మాత్రమే ఆ ఫోటోలలో కనిపించేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఫోటోలలో జనాలు పెరుగుతూ వచ్చారు. మసక చీకట్ల దృశ్యాలతో పాటు పగటి కాంతుల్లో ధగ ధగ లాడుతున్న సుందరవీధులు , పచ్చటి మొక్కలు కనపడసాగాయి. ఆ ప్రాంతాల్ని గుర్తుపట్టటానికి ఒక్కో ఫోటో నాలుగైదు సార్లు చూడాల్సి వచ్చేది. 

    . ...readmore

  • మన ఊరి శ్రీమంతుడు

     టైటిల్ వినగానే ఇదేదో గ్రామంలో ఆస్తి పరుల గురించిన కధనం అనుకోకండి. మొన్నే రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు చూశాను. గ్రామం నుండి సిటీకి వెళ్ళిపోయి అక్కడ బాగా సంపాదించిన తర్వాత మళ్ళీ సొంత ఊరుని దత్తత తీసుకుని అభివృద్ది చెయ్యటం అనే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు అందులో హీరోగా మహేష్ బాబు కనపడలేదు. యాదృచ్చికం గానే సినిమాలో మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామం పేరు దేవరకోట.

    . ...readmore

  • గల్ఫ్ లో కొలువైన కేరళ .. సలాలా

    . ...readmore

  • మరుగున పడ్డ మాణిక్యం

     రాజధాని పేరు ని అమరావతి గా ప్రకటించిన మరుక్షణమే ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా మరియు నెటిజన్లు అమరావతి పేరు వెనుక కధల్ని , దాని యొక్క చారిత్రిక నేపధ్యాన్ని పుంఖాను పుంఖాలుగా ప్రసారం చేశారు, ఇంకా చేస్తున్నారు. మన రాజధాని అమరావతి అని చెప్పుకోవటానికి ఒక ఆంధ్రుడిగా నేనెంతో గర్వపడుతున్నాను. అమరావతి ప్రాశస్త్యం తెలుగు జాతి చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

    . ...readmore

  • కువైట్ లో మనఘంటసాల వారు

     ఉద్యోగ నిర్వహణలో భాగంగా పలు దేశాలకి వెళ్ళాల్సి ఉంటుంది. గతంలో పోలండ్లో పని చేసినపుడు దాదాపు అన్ని ఐరోపా దేశాల్లో పర్యటించాను. కొంతకాలంగా దుబాయ్ లో పని చేస్తుండటంతో మా సంస్థకి సంభందించిన వ్యాపార కార్యకలాపాలు మధ్య ప్రాచ్యంలో ఉన్న ఒమన్ , కువైట్ , ఖతర్ , సౌదీ అరేబియా , బహ్రెయిన్ లలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడికి  బిజినెస్ ట్రిప్ వెళ్ళినా స్వామి కార్యం , స్వ కార్యం రెండూ కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఆఫీసు పనులయ్యాక కనీసం ఒక్క రోజు ని అక్కడి విశేషాలని , చారిత్రక అంశాలని తెలుసుకోవటానికి పెట్టుకుంటాను.

    . ...readmore

  • చరిత్ర పరిరక్షణలో ఐదేళ్ళు

     నేటికి వెబ్ సైట్ ప్రారంభించి ఐదేళ్ళు గడిచాయి. ఐదేళ్ళ క్రితం నా తోటి మిత్రులంతా వారి వితరణని పెట్టుబడిగా పెడితే నేను నా సమయాన్ని, ఆలోచనల్ని పెట్టుబడిగా పెట్టి ఈ వెబ్ సైట్ ని ప్రారంభించాం.ఈ పెట్టుబడికి ప్రతిఫలం ఉండదని మాకు తెలుసు. శ్రీ గొర్రెపాటి రవి సుధాకర్ నాకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వటంతో పాటు వెబ్ సైట్ నిర్మాణంలో వెన్ను దన్నుగా నిలబడ్డారు.

    . ...readmore

  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

     ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం. మన దేశం తర్వాత నేను నివసించటానికి అత్యంత ఇష్టపడే ప్రాంతం ఇది. నేను యూరప్ లో కొంత కాలం నివసించినా నాకు దుబాయ్ అంటేనే ఎక్కువ ఇష్టం. నేను తొలిసారి చూసిన విదేశం దుబాయ్. అందుకేనేమో ఈ దేశం అన్నా ఇక్కడి ప్రభుత్వ విధానాలన్నా నాకు అమితమైన ఇష్టం , ఆసక్తి . మొత్తంగా నేను ఈ దేశంలో నివసించింది 4 సంవత్సరాలు. మూడు జాతీయ దినోత్సవాలని ఈ దేశంలో చూశాను

    . ...readmore