వేమూరి జగపతిరామయ్య గారుBack to list

వేమూరి జగపతిరామయ్య గారు

జగపతి రామయ్య గారిని 1999 లో మొట్టమొదటి సారి కలుసుకున్నపుడు ఆయన గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. వర్లు గారితో పాటుగా అయన కూడా ఓ కార్యక్రమానికి వచ్చినపుడు మన గ్రామానికే చెందిన వ్యక్తిగా మాత్రమే నాకు పరిచయం. ఇక ఆ తరువాత ఆయన నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించినా వెళ్ళలేకపోయాను.
 
 
1960 ల ప్రాంతంలో మన గ్రామం నుంచి  హైదరాబాదులో స్థిరపడ్డ అతితక్కువ కుటుంబాల్లో జగపతిరామయ్య గారి కుటుంబం ఒకటి. తార్నాక లో మర్రి చెన్నారెడ్డి నివాసం పక్కనే వారి ఇల్లు. అప్పట్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ లకి, పై చదువుల నిమిత్తం కౌన్సిలింగ్ కి హైదరాబాదు వచ్చేవారికి మొదట గుర్తొచ్చే పేరు జగపతి రామయ్య గారిదే. ఇప్పుడంటే సమాచార విప్లవం వల్ల అందరికీ అన్నిటిమీదా కొంత అవగాహన వచ్చింది కానీ, ఇంతకుపూర్వం సిటీ కి వస్తే, తెలిసిన వారు లేకపోతే మన వాళ్ళు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అటువంటి తరుణంలోనే తన సలహా కోసం,సహాయం కోసం వచ్చిన ఎంతో మందికి తన మాట సహాయమే కాకుండా, వారితోపాటు సంభందిత కార్యాలయాలకు వెళ్లి ఆ పని అయ్యేవరకు వారితోనే ఉండి, ఊరు కి తిరిగి వెళ్ళేవరకు  వారికి అండగా నిలిచేవారు. ఇది నా స్వానుభవం కాదు. వెబ్ సైట్ రూపకల్పన సమయంలో నేను కలుసుకున్న కొంతమంది పెద్దలు చెప్పిన సత్యం. జగపతి రామయ్య గారు మన గ్రామంలో వేమూరి వెంకటరత్నం, రాజేశ్వరమ్మ దంపతులకి మొదటి సంతానంగా సామాన్య రైతు కుటుంబంలో 01.07.1933 న జన్మించారు. మన హైస్కూల్ లోనే ప్రాధమిక విద్య ని అభ్యసించారు. తరువాత గుడివాడ ANR కాలేజిలో డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు ఎ సి కాలేజి లో బి ఈడి చేశారు. విద్యావంతుడు,యువకుడు అయిన జగపతి రామయ్య గారికి ఎంతో మంది తమ కుమార్తె నిచ్చి వివాహం చెయ్యటానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే హైస్కూల్ లో తనతో పాటు చదువుకున్న శ్రీకృష్ణ గారితో ఉన్న పరిచయంతో ఆమెనే వివాహమాడాలని నిశ్చయించుకున్నారు. ఇద్దరి డిగ్రీ పూర్తయ్యాక 1950 జనవరి 17 న వీరి వివాహం జరిగింది. శ్రీ కృష్ణమ్మ మన పొరుగునే ఉన్న ఘంటసాలపాలెం గ్రామస్తులైన కొండపల్లి రామకోటయ్య,రాజ్యలక్ష్మి గార్ల కుమార్తె. రామకోటయ్య గారు అభ్యుదయవాది,తాలుకా కమ్యునిస్టు నాయకులు. ఇప్పుడు ఘోటకంలో ఉన్న పేద హరిజన ప్రజలకు స్థలాలు ఆక్రమించి వారికి ఇళ్ళు కట్టించిన ఘనత ఆయనదే. ఇక బి ఈడి పూర్తయ్యాక 1960 లో సికిందరాబాదు రైల్వే స్కూల్ లో ఉపాధ్యాయుడుగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తదనంతరం ఉత్కళ విశ్వవిద్యాలయం నుంచి ఎం ఎ పూర్తి చేసి రైల్వే జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా పదోన్నతి పొందారు. వారి సతీమణి శ్రీ కృష్ణ కూడా ఇదే కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పని చేశారు. తరువాత గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా మహారాష్ట్ర లోని పూణే రైల్వే స్కూల్ లో కొంతకాలం పని చేశారు. ఆ స్కూల్ లో కంప్యూటర్ విద్యని ప్రవేశ పెట్టిన ఘనత జగపతి రామయ్య గారిదే. 1988 లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడుగా వెండిపతకం, 1993 లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు గా అవార్డు. నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ టీచర్స్ అవార్డు ఇవన్నీ అయన అందుకున్న అనేక సత్కారాల్లో కొన్ని మాత్రమే.
 
 
రైల్వే స్కూల్స్ ని అభివృద్ధి చెయ్యటం లో ఆయన చూపిన చొరవ, సమస్యల్ని సవ్యంగా పరిష్కరించిన తీరు, ఆయన్ని ఎంతో మందికి ఆత్మీయుడుగానే కాక మహోన్నత మానవతా మూర్తిగా నిలిపింది. తార్నాక విజయపురి కాలనీ లో ఆయన నివాసం ఉన్న రోడ్డు ఇప్పుడు జగపతి రామయ్య వీధిగా  మార్చటం స్థానికులకి ఆయనమీద ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. ఆ కాలనీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయనకూడా ఒకరు.
పదవీ విరమణ తరువాత కూడా ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఆయన్ని 2005 వ సంవత్సరంలో కలిగిన భార్యావియోగం కుంగదీసింది. 55 సంవత్సరాల సహచర్యంలో అన్యోన్య దాంపత్యాన్ని చవి చూసిన ఆమె జ్ఞాపకాలతోనే భార్య వియోగాన్ని భరించలేని భర్తగా 02.11.2005 న ఆమె మరణించిన తొమ్మిది నెలలకే కన్నుమూసారు. మరణాంతరం తన కళ్ళని ఓ స్వచ్చంద సంస్థ కి దానం చెయ్యటం ద్వారా తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎప్పుడూ పదిమంది మంచి కోరుతూ ,తమ చేతనైన సహాయం చేస్తూనే జీవితాన్ని చాలించిన జగపతిరామయ్య దంపతులు పలువురికి ఆదర్శ ప్రాయులు. జీవితంలో ఒక్కసారే ఆయన్ని కలుసుకున్నాననే అసంతృప్తి ఉన్నా, ఈ వెబ్సైట్ ద్వారా మరింతమందికి ఆయన్ని తెలియ చేయగలిగాననే సంతృప్తి మాత్రం మిగిలింది.
                                           Jagapati Ramayya Gari Family
 
1) Vemuri Vivekanand      Elder Son         Manager, CommercialAIR INDIA / HYD
   Vemuri Padma  Wife    Lecturer Wesley Degree  College ,HYD
   ( Two Sons ,Rahul- B.Tech -- MS IN USA  Rohit -- ECE  B.TECH

2) Dr V.Indira--daughter-- MA .M,Ed.P.HD Principal Railway Junior College,Secunderabad

     P.V.Narasimha Rao Manager Indian Bank

( Two sons --Sravan --- B.TECH -- MS IN USA  working-- Varun,---B.TECH --now MBA IN XLRI-(Jamshedpur)

3) Vemuri Gopi Chand       Late Younger Brother  Civil Engg/ APSRTC/ HYD

    Vemuri Neeraja            Wife     House wife

   One son- Vamsi Krishna-- BE.Final year--Daughter Reetika--- Inter ist yr
 
Dated : 11.02.2012
 

 

This text will be replaced