రవితేజ టిఫిన్ సెంటర్ పార్ట్ -2Back to list

రవితేజ నారాయణ తో మనఘంటసాల ఎడిటర్ రాజేష్ వేమూరి ప్రత్యేక ఇంటర్వ్యూ తరువాయి భాగం

 రాజేష్ వేమూరి : మీకు సేవాభావం కూడా ఎక్కువే అని విన్నా

అవును, కాని అవన్నీ నేను చెప్పను.

రాజేష్ వేమూరి : చెప్పకపోతే ఎలా? మీరు చేసేవి అందరికీ తెలిస్తే మరికొంతమందికి స్ఫూర్తిగా ఉంటుంది, పర్లేదు చెప్పండి.

నేను చేసిన వ్యక్తిగత సహాయాల గురించి చెప్పను కాని, కొన్ని ధార్మిక సంస్థలకి మాత్రం నా వంతు సాయం చేస్తూనే ఉంటాను. ప్రతి వారం హేల్లెన్ కెల్లర్ అంధుల బడిలో భోజనాలు పెడతాను. కొన్నిసార్లు వాళ్ళతోనే కూర్చుని భోజనం చెయ్యటం ఇష్టం. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు మాత్రం నా దగ్గర పనిచేసే వాళ్ళతో చేసుకుంటాను. ఆ రోజు రాత్రి రోడ్డు పక్కన పడుకునే వాళ్ళని లేపి బిర్యానీలు ఇస్తాను. నాకు స్నేహితులు కూడా ఎక్కువే, ఘంటసాలలో ఉన్న నా మిత్రులతో స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఎవరైనా నా దగ్గరికి వచ్చి సహాయం కోరితే నేనెప్పుడూ కాదనలేదు. నా దగ్గర పని చేసేవాడు అంటే నా కుటుంబంలో ఒకరు అనే అనుకుంటా. ఘంటసాలలో వంపుగాని ఆదిశేషు అని మా నాన్న దగ్గర పనిచేసేవాడు.ఆ ఆదిశేషు వాళ్ళ నాన్న మా తాత దగ్గర పనిచేసేవాడు. ఇప్పుడు ఆ ఆదిశేషు వాళ్ళ అబ్బాయి నా దగ్గర ఉన్నాడు.వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేనే చూసుకుంటా అని చెప్పా.ఒక వేళ ఆదిశేషు చనిపోయినా నేను రాకుండా తీసేకెళ్ళటానికి వీల్లేదు అని చెప్పా. నాకు కులం మతం అనే పట్టింపులేవి లేవు. నన్ను నమ్ముకున్న వాళ్ళకోసం ఏదైనా చేసే మనస్తత్వం నాది.

 
రాజేష్ వేమూరి : మీ భోళా తనాన్ని అవకాశంగా తీసుకుని ఎవరూ మిమ్మలని మోసం చెయ్యలేదా?
చేశారు, కాని నన్ను మోసం చేసి ఎవరన్నా నా దగ్గర డబ్బులు తీసుకున్నపుడల్లా దేవుడు నాకు రెండింతలు ఇచ్చాడు. కాబట్టి అలాంటి వాటి గురించి బాధపడను.అలాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానివ్వను. 
రాజేష్ వేమూరి : ఇన్నేళ్ళ ఒడిదుడుకుల ప్రయాణం తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరికీ థాంక్స్ చెప్తారు ? ఎవర్ని నిందిస్తారు ?
థాంక్స్ చెప్పేది మా ఆవిడకే. నేను తనకి తోడుగా ఉన్నా లేకపోయినా,తను మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంది. అసలు నన్ను భరించటమే గొప్ప. ఇక కష్టాలకి నేను ఎవర్నీ నిందించను, అన్నిటికీ నేనే కారణం.
 
రాజేష్ వేమూరి : మిమ్మల్ని అంతా ఏమని పిలుస్తారు 
ఘంటసాల రాకముందు నా పేరు రత్న నారాయణ, ఘంటసాలలో రవితేజ నారాయణ అనేవారు, ఇప్పుడు వంటిల్లు నారాయణ అంటారు.
రాజేష్ వేమూరి : మీ జీవిత అనుభవాలని , ఎన్నో విశేషాలని తెలియచేశారు. థాంక్స్ అండీ. 
మీకు కూడా ధన్యవాదాలు
 
 
 
 
మరిన్ని చిత్రాలకై ఇక్కడ క్లిక్ చేయండి
Dated : 18.12.2015

This text will be replaced