Europe Travelogue

  • నా ఐరోపా యాత్ర - 18 (వెనిస్)

     కొత్తగా పెళ్ళైన జంటకి మొదటి డ్రీమ్ హనీమూన్ ప్రదేశం అంటే  వెనిస్ నగరమే. నేను బ్రహ్మ్మచారిగా సంవత్సరం పాటు యూరప్ లో నివసించినా , వెనిస్ వెళ్ళగల అవకాశం ఉండి కూడా అక్కడికి వెళ్ళలేదు. పెళ్ళయ్యాక సతీ సమేతంగా మాత్రమే  వెళ్ళాలనుకున్న నగరం వెనిస్. తరువాతి కాలంలో అన్ని దేశాలు ఏకకాలం లో చుట్టేసినా ,ఇటలీలో ఉన్న  వెనిస్ నగరాన్ని మాత్రం ప్రత్యేకంగా సందర్శించాము. మేము ఉండే పోలాండ్ కి వెనిస్ 1100 కిలోమీటర్లు.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 17 (బెర్లిన్)

     అక్కడినుండి బయలు దేరి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో అందరం లంచ్ చేసాం. బెర్లిన్ రావటం నాకు రెండోసారి. మొదటిసారి IELTS test రాయటం కోసం వచ్చాను, అప్పుడు అంతా మంచు కురవటంతో నేను అంతగా బెర్లిన్ ని చూడలేదు. జర్మనీలో ఈశాన్య దిశలో గల బెర్లిన్‌ది యూరప్‌లో జనాభాలో ఏడవ స్థానం. వెస్ట్ ఫ్లావిక్ భాషలో దీని అసలు పేరు బెర్ల్‌బిర్. అంటే, బురదనేల. అది బెర్లిన్‌గా రూపాంతరం చెందింది. 13వ శతాబ్దంలో ప్రష్యా సామ్రాజ్యానికి ఇది రాజధాని. 1918లో, అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రష్యా సామ్రాజ్యం కూలిపోయాక జర్మన్ ఎంపైర్‌గా మారింది.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 16 (బెర్లిన్)

     ​​నవంబర్లో స్వీడన్ పర్యటన తర్వాత ఎక్కడికీ వెళ్ళలేదు. అప్పటికే మంచు కురవటం మొదలయ్యింది. మళ్ళీ  మార్చ్ చివరిదాకా యూరప్ అంతా మంచుతో కప్పబడే ఉంటుంది. అక్టోబర్లో యూరప్ లో అన్ని దేశాల్లో సమయాన్ని ఒక గంట వెనక్కి మారుస్తారు. చలికాలం లో  పగలు చాలా తక్కువ సమయం ఉంటుంది. మళ్ళీ వేసవి రాగానే సమయాన్ని ఒక గంట ముందుకు మారుస్తారు.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 15 (స్వీడన్)

    నేను ఇంతకుముందు చెప్పినట్లు యాక్సెస్ కార్డు తో ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అయినా ప్రయాణం చెయ్యవచ్చు. అది ఉపయోగించి అక్కడున్న బోటు లో షిప్ మ్యూజియం కి చేరుకున్నాము. ఈ మ్యూజియం పేరు వాసా ముసీట్ (స్వీడిష్ భాషలో ముసీట్ అంటే మ్యూజియం). దీనికి ప్రవేశ రుసుము 200 స్వీడిష్ క్రోనాలు. ఈ నౌక వెనుక పలు ఆసక్తి కరమైన విషయాలు అక్కడున్న గైడ్ వివరించింది. 1626 లో స్వీడన్ రాజు Gaustav II Adolf పోలాండ్ మీద యుద్ధం చెయ్యటానికి ఒక యుద్ధనౌక ని నిర్మించాలని అనుకున్నాడు. దీనికోసం హెన్రీ అనే ఒక డచ్ ఇంజినీర్ ని నియమించాడు. స్టాక్ హోం షిప్ యార్డులో 1626 లో దీని నిర్మాణం ప్రారంభమై ఒక సంవత్సరం తరువాత 1627 సంవత్సరాంతానికి ఆ షిప్ నిర్మాణం పూర్తయ్యింది

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 14 (స్వీడన్)

     మరుసటి రోజు సెలవు కావటంతో శరవణన్ నాకు, శశి కి నగరాన్ని చూపించటానికి బయలుదేరాడు. ఆ రోజు బాగా చలిగా ఉంది , ఉష్ణోగ్రత - 2 డిగ్రీలు గా చూపిస్తోంది. నవంబర్ నెల కావటంతో అప్పుడప్పుడే చలికాలం మొదలవుతోంది. స్వీడన్ లో కార్ల కంటే వాటిని మెయిన్ టైన్ చెయ్యటం చాలా ఖరీదు. ఫ్రీ పార్కింగ్ అనేది ఎక్కడా ఉండదు. పని చేసే ఆఫీసుల్లో సైతం పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 13 (స్వీడన్)

     పోలాండ్ తర్వాత నేను చూసిన తరువాతి దేశం స్వీడన్ . నా రూమ్మేట్ శశి వాళ్ళ తమ్ముడు స్వీడన్లో ఉంటున్నాడు. తమిళనాడులో ఇంజినీరింగ్ అయిపోయాక మాస్టర్స్ చేయటానికి స్వీడన్ వచ్చాడు. ఇప్పుడు చదువు అయిపోయి అక్కడే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. శశి తన తమ్ముడిని కలవడానికి వెళుతూ నవంబర్ 16, 2012 న నన్ను కూడా తనతో రమ్మని అనటంతో 3 రోజుల అక్కడ గడపటం కోసం ఇద్దరం బయలుదేరాం. విమానయాన సంస్థ విజ్జ్ ఎయిర్ పోలాండ్లోని పోజ్నాన్ నుండి స్వీడన్ కి విమానాలు నడుపుతుంది

    . ...readmore