Europe Travelogue

  • నా ఐరోపా యాత్ర - 6 (పోలాండ్)

     యూదులు పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు. క్రీస్తు పూర్వం ఈ మతం ఉంది. వీరి దేవుడు మెసయ్య ఎప్పటికైనా వస్తాడని నమ్ముతారు . వీరి ప్రార్ధనా మందిరాలని సినగోగాస్ అంటారు. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. అక్కడ  ఏసుక్రీస్తును శిలువ చేసి చంపిన తరువాత యూదులు భయకంపితులై ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి చెల్లాచెదురుగా ఐరోపా, అమెరికాలకు వలస పోయి అక్కడ స్థిరపడ్డారు.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 5 (పోలాండ్)

     నేను ఎంతోమంది గొప్పవాళ్ళ ఆటో బయోగ్రఫీలని చదివాను. జీవితంలో వారి ప్రతి లక్ష్యం వెనుక ఒక ఆశయం కనపడింది. అది వారికైనా మేలు చేసేది,లేక సమాజానికైనా మేలు చేసేదిగా ఉండేది. నాకు అర్ధం కానిది, నాకు ఇప్పటికీ అంతు చిక్కనిది హిట్లర్ జీవితం, అతని ఆశయం. నియంతృత్వంతో ప్రపంచాధిపత్యం సాధించాలనే కోరికతో ఎంతోమంది యుద్ధ పిపాసులు నియంతలుగా అవతరించారు. తన సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని మట్టు బెడుతూ మాత్రమే వారు నియంతృత్వంతో వ్యవహరించారు. కాని ఎవరూ లక్ష్యాన్ని చేరుకోకుండానే మరణించారు. కాని అలాంటి వారికి భిన్నమైన మనస్తత్వం హిట్లర్ ది.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 4 (పోలాండ్)

     మింజు జేర్జ్ లో ఇంటి అద్దెలు తక్కువే,మన డబ్బుల్లో 25000 పెడితే రెండుగదుల విలాసవంతమైన ఫ్లాట్ దొరుకుతుంది. నాకు మా సంస్థే అన్ని ఏర్పాట్లు చెయ్యటం వల్ల ఆ ఖర్చు లేదు. TESCO అనేది ఇక్కడ అతిపెద్ద హైపర్ మార్కెట్. బ్రిటన్ కి చెందిన ఈ గొలుసుకట్టు చిల్లర వాణిజ్య సంస్థ మన దేశంలో FDI ల పుణ్యమా అని త్వరలో భారత దేశంలో  అన్ని ప్రాంతాల్లో తమ స్టోర్ లని తెరవనుంది. దీనితోపాటు పోలాండ్ దేశానికే చెందిన పలు సూపర్ మార్కెట్లు కూడా మింజు జేర్జ్ లో ఉన్నాయి. మన రాష్ట్రంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగే ఇక్కడి ప్రభుత్వం కూడా ఒక మాదిరి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామిక వాడలని కేటాయించింది. 

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 3 (పోలాండ్)

     నేను ఒక్కడినే కావటంతో అదే సంస్థ లో పనిచేస్తున్న శశి అనే ఒక తమిళియన్ ఫ్లాట్ లో నాకు వసతి ఏర్పాటు చేసారు. టాక్సీ డ్రైవర్ సామాను తీసుకుని 4 వ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ కి తీసికెళ్ళాడు. ఇక్కడ అయిదు ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్ల కి కూడా లిఫ్ట్ లేదు. మెట్ల ద్వారానే బ్యాగ్ మోసుకుంటూ పైకి వెళ్లాను. ఈ శశి అనే వ్యక్తి కూడా ముద్రణా రంగంలో పట్టబద్రుడు. పరస్పర మిత్రుల ద్వారా అంతకుముందే ఫోన్ లో పరిచయం చేసుకోవటంతో మేము ఒకరికొకరం తెలుసు. ఆతను నాకంటే 6 నెలలు ముందు నుండే అక్కడ ఉంటున్నాడు. మేము కాకుండా మరో పదిమంది వరకు భారతీయులు అక్కడ అదే సంస్థలో పని చేస్తున్నారు. తెలుగువాడిని మాత్రం నేనొక్కడినే.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 2

    ఖతర్ నుండి వేరే విమానంలో ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళాలి. ఆ ఫ్లైట్ కి ఇంకా మూడుగంటల సమయం ఉంది. ఖతర్ విమానాశ్రయం చాలా పెద్దది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకి ఇక్కడినుండి విమానాలు ఉన్నాయి. ఆసియా దేశాలనుండి అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకి  వెళ్ళే ప్రయాణీకులకి ఇది జంక్షన్. ఇక్కడే ఎక్కువ మంది ఫ్లైట్ మారాల్సి ఉంటుంది. ఖతర్ కరెన్సీ పేరు రియాల్. ఒక్క రియాల్ కి మన డబ్బుల్లో 16 రూపాయలు వస్తాయి. మనం మారే ఫ్లైట్ కి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉంటె ఎయిర్ పోర్ట్ లోనే వీసా తీసుకుని బయటకి వెళ్లి చూసి రావచ్చు.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - I

    జీవితంలో కొన్ని అనుకోని అవకాశాలు మన జీవన గమనాన్నే మార్చేస్తాయి. సంవత్సరానికి కేవలం 2830 రూపాయలు ఫీజు కట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న ప్రింటింగ్ టెక్నాలజీ చదువు నన్ను ఈ ప్రపంచంలో 12 దేశాల్లో పర్యటించటానికి దోహదం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. చదువు పూర్తీ చేసుకున్న ఏడాది లోనే దుబాయ్ వెళ్ళే అవకాశం రావటం జీవితంలో పెద్ద మలుపు. నా ఆలోచనల పరిధి అమాంతంగా పెరిగిపోవటానికి ఆ అవకాశం మరియు అక్కడ పనిచేసిన రెండు సంవత్సరాల కాలం ఎంతో ఉపయోగపడింది.

    . ...readmore