Europe Travelogue

  • నా ఐరోపా యాత్ర - 12(పోలాండ్)

     వార్సా అనేది పోలాండ్ రాజధాని నగరం. నేను మొత్తం 3 సార్లు ఈ నగరాన్ని సందర్శించటం జరిగింది. ఇప్పుడు మేము వెళుతున్నది ​అక్కడున్న ఇండియన్ ఎంబసీ నుండి జన్మదిన ధృవీకరణ పత్రం తీసుకోవటానికి. నేను మొదట్లో చెప్పినట్లుగా ఇక్కడ అన్నీ స్థానిక పరిపాలనలోనే జరుగుతాయి. మేము నివసించే మింజు జేర్జ్ నగర కార్యాలయంలోనే నివాస ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుంది. ఆ కార్డ్ కాల పరిమితి కూడా ఆయా స్థానిక అధికారే నిర్ణయిస్తాడు. ఆ కార్డు ఉంటే యూరప్ లో ఉన్న 24 దేశాలకి ఎటువంటి వీసా అవసరం లేదు. దానినే మన పాస్ పోర్ట్ గా పరిగణిస్తారు

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 11(పోలాండ్)

     జాకోపాన అనేది గ్రామం పేరు. అక్కడున్న పర్వతాల్ని Tatra Mountains అంటారు. క్రాకో నుండి 110 కిలోమీటర్లు ప్రయాణించాక జాకోపాన చేరుకున్నాం. ఆదివారం కావటంతో అక్కడికి వెళ్ళే కార్లతో అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దారిలో చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ, ఎత్తైన కొండలు మధ్యలో విశాలమైన రోడ్డు మీదుగా అత్యంత ఆహ్లాద కరంగా మా ప్రయాణం సాగింది. మధ్యలో ఒక ఊరుని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఊర్లోనే జన్మించాడు అని.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 10 (పోలాండ్)

     ఎటు చూసినా గుంపులు గా సందర్శకులు ఉన్నారు. లోపల మెట్లు, తలుపులు అన్నీ చెక్కతో చేసినవే ఉన్నాయి. గైడ్ అన్నీ వివరంగా చెప్తూ ముందుకు వెళుతోంది. నా అమ్ములపొదిలో ఎప్పుడూ ఉండే ఆ మొదటి ప్రశ్న అడిగేశాను. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినపుడు నాజీలు ఇక్కడికి కూడా వచ్చారా అని. యుద్ధం మొదలైన దగ్గరనుంచి ఇది కొన్నాళ్ళు నాజీల ఆధ్వర్యంలోనే ఉందని గైడ్ చెప్పింది. ఇప్పుడు మేము తిరుగుతున్న ప్రాంతం అంతా గత కొన్నేళ్లుగా ఉప్పు కోసం తొలచిన గుహ. 

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 9 (పోలాండ్)

     ఆశ్విత్జ్ నుండి క్రాకో నగరంలో ఉన్న ఉప్పు గని 90 కిలోమీటర్లు. ఆష్విత్జ్ చూశాక మనసంతా భారంగా తయారయ్యింది. అందరం కారులో నిశబ్ధంగానే కూర్చున్నాం. మార్చిన్ కి ఇవన్నీ తెలిసి ఉండటంతో తను త్వరగానే ఆ మూడ్ నుండి బయటకి వచ్చాడు. GPS సహాయంతో ఇంకా ఎంత దూరం ఉందో చూసుకున్నాడు. మమ్మల్ని మూడ్ లోకి తీసుకు రావటానికి పోలిష్ జోక్స్ చెప్పటం ప్రారంభించాడు. మా సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో ఇంగ్లీషు మాట్లాడగలిగిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో మార్చిన్ ఒకడు. ఇండియన్స్ అందరికీ స్థానికంగా ఏ సహాయం కావాలన్నా తనే చేసేవాడు.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 8 (పోలాండ్)

    పదవ బారక్ ఆడవాళ్ళ పాలిట నరక కూపం. అందులో జర్మన్ డాక్టర్లు ఆడవాళ్ళపై రక రకాల ప్రయోగాలు చేసేవారట. గర్భిణి స్త్రీలకి ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండానే లోపల పిండం ఎలా ఉందో అని కోసి చూసేవారు. ఇంకా స్త్రీల అవయవాలన్నీ కోసి వాటిపై పరిశోధనలు చేసారు. రకరకాల ఔషధాలని ప్రయోగించి అవి పనిచేస్తునాయో లేదో అని పరీక్షించేవారు. ఇవన్నీ బతికున్న మనుషులపైన ఎటువంటి మత్తు మందు లేకుండా జరిపిన పాశవిక హత్యా కాండ. 

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 7 (పోలాండ్)

     అక్కడ ఉన్న టూరిస్టులు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అందరి వదనాల్లో విచారమే తప్ప ఉత్సాహం లేదు. రుస్కి ఎంట్రన్స్ అంటే రష్యా యుద్ధ ఖైదీలని తీసికెళ్ళే ద్వారం అది. ఇప్పుడు కాంపులోకి వెళ్ళటానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. వెళ్ళే దారిలో ఆ ప్రాంతాన్ని దర్శించి నివాళులర్పించిన వివిధ దేశాల అధ్యక్షుల వివరాలన్నీ ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టారు.వాటిని దాటుకుంటూ టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. ఇంగ్లీష్ గైడ్ కావాలంటే మనిషికి 25 జిలోటీ లు పోలిష్ భాష అయితే 15 జిలోటీలు ప్రవేశ రుసుము. 20 మందికి ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్ చెప్పేది వినటానికి ఒక ఎలెక్ట్రానిక్ రేడియో మరియు హెడ్ ఫోన్స్ ఇస్తారు.

    . ...readmore