e-Books Information

  • మన కిసాన్ వెంకట సుబ్బయ్య

    గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు కిసాన్ వెంకట సుబ్బయ్య గా ఆంధ్ర దేశమున పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి.రైతు నాయకుడు గా పలు పోరాటాలను మరియు రైతుల సంక్షేమం కోసం పలు ఉద్యమాలను నడిపిన సారధి.ప్రముఖ రైతు నాయకులు , అభ్యుదయవాది అయిన ఆచార్య ఎన్ . జి రంగా గారు ఈ యన జీవిత విశేషాలని మన కిసాన్ వెంకట సుబ్బయ్య అనే ఈ పుస్తక రూపం లో అందించారు.

    . ...readmore

  • వేమూరి వారి చరిత్ర

    వేమూరి వారు ఘంటసాల గ్రామ ప్రముఖులు.వీరిదే ఒకనాటి గ్రామ పెత్తనము.వీరు స్వతహాగా ఈ గ్రామానికి చెందిన వారే.ఎక్కడి నుండి వచ్చారో కనుక్కొనుటకు ఆధారాలు లేవు.వీరిని బట్టే గొర్రెపాటి వారు కానుకొలను నుండి ఈ గ్రామానికి వలస వచ్చారు.దేవరకోట ,ఘంటసాల ,ఘంటసాల పాలెం వేమూరి వారంతా ఒకే కుదుటి వారు.తదనంతరం అనేక తెగలు గా విడిపోవుట జరిగినది.అదెందుకంటే ఎవరైనా చనిపోతే వేమూరి వారందరికి మైలు రావటం వల్ల ఇతరులు శుభకార్యాలు చేసుకోనలేక పోయేవారు.అందువలననే రామన్న ,రమణప్ప ,అప్పన్న ,పాపన్న ,అంకన్న ,చంద్రయ్య ,బ్రహ్మన్న ,ఘంటన్న ,పుల్లయ్య అనే తెగలు గా విడిపోయారు.వీటిల్లో రమణప్ప తెగ కి చెందిన వేమూరి నాగేశ్వరరావు గారు తమ కుటుంబ చరిత్ర ని పుస్తక రూపం లో తీసుకు వచ్చారు.

    . ...readmore

  • గొర్రెపాటి వారి చరిత్ర

    గొర్రెపాటి వారు కమ్మవారు ,గడచిన 200 ఏళ్ళు గా ఆంధ్ర దేశమున పేరెన్నిక గన్నది వంశము.ఘంటసాల గ్రామ రాజకీయాల్లో ,అభివృద్ధి లో వీరి పాత్ర అభినందనీయము. 1970 వ దశకము లో శ్రీ గొర్రెపాటి వెంకట నరసయ్య గారు ఈ గ్రంధాన్ని రచించారు.తదనంతరం శ్రీ గొర్రెపాటి రవి సుధాకర్ 2011 లో ఈ -బుక్ రూపం లో అనువదించి భద్ర పరచుట జరిగినది.

    . ...readmore

  • నా జీవన నౌక

     తన జీవితం లో చేస్తూ వచ్చినట్లే తన జీవిత చరిత్ర రచన లో సైతం ఆ మంచిని చూడటానికే ప్రయత్నించారు అని నార్ల వెంకటేశ్వరరావు గారు కించిత్తు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ,ఎవరి మీద ఒక్క ఆరోపణ కూడా లేకుండా తన జీవిత చరిత్ర ని రాసుకున్న వ్యక్తిగా గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు చరిత్ర లో నిలిచిపోతారు.1898 నుంచి 1984 వరకు 86 ఏళ్ళు బ్రతికి ,అందులో ఎక్కువ భాగం క్రియా శీల రాజకీయాల్లో తల మునకలు గా బ్రతికిన వ్యక్తికి సహజం గానే పరిచయాలు మెండు. వాళ్ళందరి గురించి తనకు తెల్సిన మంచి విషయాలు మాత్రమే రాయటం బహుశా ఆయనకొక్కరికే సాధ్యమైన పనేమో.

     

     

    . ...readmore

  • ఘంటసాల చరిత్ర ద్వితీయ ముద్రణ

    ఘంటసాల చరిత్ర - 1966

     

     ఘంటసాల చరిత్ర మొట్టమొదటి సారిగా 1947 లో ముద్రించబడింది.చరిత్ర కారుడు శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఆనాడే దూర దృష్టి తో భావితరాలకు చరిత్ర ని అందించాలనే ధృడ సంకల్పంతో ఎన్నో వ్య య ప్రయాసల కోర్చి ఈ గ్రంధాన్ని రచించారు.ఇప్పటికీ గ్రామ చరిత్ర తెలుసు కోవటానికి మిగిలిన ఏకైక ఆధారం ఈ గ్రంధం ఒక్కటే.తదనంతరం 1966 లో ఈ ద్వితీయ భాగం  మరింత విపులం గా రచించారు.ఆ పుస్తకాన్ని మళ్లీ నేటి ఆధునిక పరిజ్ఞానం తో ఈ - బుక్ రూపం లో భద్రపరచటం జరిగింది.అంతే కాకుండా రెండు భాగాలని కలిపి ఒకే పుస్తకం గా 2011 లో రచయిత కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం తో పునర్ ముద్రించారు.కాపిలకై మాకు మెయిల్ చేయండి.

    . ...readmore

  • ఘంటసాల చరిత్ర ప్రధమ ముద్రణ

    ఘంటసాల చరిత్ర - 1947

    ఘంటసాల చరిత్ర మొట్టమొదటి సారిగా 1947 లో ముద్రించబడింది. చరిత్ర కారుడు శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఆనాడే దూర దృష్టి తో భావితరాలకు చరిత్ర ని అందించాలనే ధృడ సంకల్పంతో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ గ్రంధాన్ని రచించారు.ఇప్పటికీ గ్రామ చరిత్ర తెలుసు కోవటానికి మిగిలిన ఏకైక ఆధారం ఈ గ్రంధం ఒక్కటే.తదనంతరం 1966 లో ద్వితీయ భాగం రచించారు.కానీ 1947 నాటి పుస్తకం భౌతికం గా ఒకే ఒక్క కాపీ మాత్రమే ఇపుడు ఉంది.ఆ పుస్తకాన్ని మళ్లీ నేటి ఆధునిక పరిజ్ఞానం తో ఈ - బుక్ రూపం లో భద్రపరచటం జరిగింది.అంతే కాకుండా రెండు భాగాలని కలిపి ఒకే పుస్తకం గా 2011 లో రచయిత కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం తో పునర్ ముద్రించారు.కాపిలకై మాకు మెయిల్ చేయండి.

     

     

    . ...readmore