వేమూరి వారి చరిత్ర Back to list

 

 

 

వేమూరి వారి చరిత్ర 

 వేమూరి వారు ఘంటసాల గ్రామ ప్రముఖులు.వీరిదే ఒకనాటి గ్రామ పెత్తనము.వీరు స్వతహాగా ఈ గ్రామానికి చెందిన వారే.ఎక్కడి నుండి వచ్చారో కనుక్కొనుటకు ఆధారాలు లేవు.వీరిని బట్టే గొర్రెపాటి వారు కానుకొలను నుండి ఈ గ్రామానికి వలస వచ్చారు.దేవరకోట ,ఘంటసాల ,ఘంటసాల పాలెం వేమూరి వారంతా ఒకే కుదుటి వారు.తదనంతరం అనేక తెగలు గా విడిపోవుట జరిగినది.అదెందుకంటే ఎవరైనా చనిపోతే వేమూరి వారందరికి మైలు రావటం వల్ల ఇతరులు శుభకార్యాలు చేసుకోనలేక పోయేవారు.అందువలననే రామన్న ,రమణప్ప ,అప్పన్న ,పాపన్న ,అంకన్న ,చంద్రయ్య ,బ్రహ్మన్న ,ఘంటన్న ,పుల్లయ్య అనే తెగలు గా విడిపోయారు.వీటిల్లో రమణప్ప తెగ కి చెందిన వేమూరి నాగేశ్వరరావు గారు తమ కుటుంబ చరిత్ర ని పుస్తక రూపం లో తీసుకు వచ్చారు.