ఘంటసాల చరిత్ర ప్రధమ ముద్రణ Back to list

 

ఘంటసాల చరిత్ర మొట్టమొదటి సారిగా 1947 లో ముద్రించబడింది. చరిత్ర కారుడు శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఆనాడే దూర దృష్టి తో భావితరాలకు చరిత్ర ని అందించాలనే ధృడ సంకల్పంతో ఎన్నోవ్యయ ప్రయాసల కోర్చి ఈ గ్రంధాన్ని రచించారు.ఇప్పటికీ గ్రామ చరిత్ర తెలుసు కోవటానికి మిగిలిన ఏకైక ఆధారం ఈ గ్రంధం ఒక్కటే.తదనంతరం 1966 లో ద్వితీయ భాగం రచించారు.కానీ 1947 నాటి పుస్తకం భౌతికం గా ఒకే ఒక్క కాపీ మాత్రమే ఇపుడు ఉంది.ఆ పుస్తకాన్ని మళ్లీ నేటి ఆధునిక పరిజ్ఞానం తో ఈ - బుక్ రూపం లో భద్రపరచటం జరిగింది.అంతే కాకుండా రెండు భాగాలని కలిపి ఒకే పుస్తకం గా 2011 లో రచయిత కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం తో పునర్ ముద్రించారు. కాపిలకై మాకు మెయిల్ చేయండి.