గొర్రెపాటి వారి చరిత్ర Back to list

శ్రీ గొర్రెపాటి గురవయ్య 265 సంవత్సరాల క్రితం కైకలూరు తాలుకా కానుకొలను నుండి ఘంటసాల గ్రామానికి వచ్చారు. వీరి ముగ్గురు సోదరుల్లో ఒకరు కానుకోలనులోనే ఉండగా, రెండవ ఆయన గుంటూరు జిల్లా లో గరికపూడి వెళ్లారు. మూడవ వారైన గురవయ్య ఘంటసాల రావటంతో వారి వంశం ఘంటసాలలో విస్తరించింది. గురవయ్య గారి సోదరి వెంకమ్మ ని ఆళ్ళ వారికి ఇచ్చి వివాహం చెయ్యటంతో ఆమె ఆళ్ళ వెంకమ్మ అయింది. ఆమె పేరు మీద తవ్వించిన చెరువు మన గ్రామ ప్రారంభంలో ఉండే ఆళ్ళ వెంకమ్మ చెరువుగా ప్రసిద్ది పొందింది. గొర్రెపాటి వారు కమ్మవారు ,గడచిన 200 ఏళ్ళు గా ఆంధ్ర దేశమున పేరెన్నిక గన్నది వంశము.ఘంటసాల గ్రామ రాజకీయాల్లో ,అభివృద్ధి లో వీరి పాత్ర అభినందనీయము. 1970 వ దశకము లో శ్రీ గొర్రెపాటి వెంకట నరసయ్య గారు ఈ గ్రంధాన్ని రచించారు.తదనంతరం శ్రీ గొర్రెపాటి రవిసుధాకర్ 2011 లో ఈ -బుక్ రూపం లో అనువదించి భద్ర పరచుట జరిగినది.