సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయం Back to list

సుబ్రమణ్యేశ్వరస్వామి   దేవాలయం 

 ఈ గుడి ని 1813లో గొర్రెపాటిచెంచయ్య గారి కుమారుడు కృష్ణమ్మ జలధీశ్వరాలయ ప్రాంగణంలో కట్టించారు .ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఊరి ఆడపడుచుల గుడి .షష్టి గుడి గా అందరికీ సుపరిచితమైనది.నాటి నుంచి నేటి వరకు మార్గశిర శుద్ధ షష్టి కి సుబ్బారాయుడి కల్యాణం రంగ రంగ వైభవంగా జరుగుతుంది .మొదటిరోజు ధ్వజారోహణ,రెండవరోజు జగాజ్యోతి,మూడవరోజు కల్యాణం జరుగుతాయి.ఈ గ్రామ ఆడపడుచులంతా ఎక్కడున్నా షష్టి కిమాత్రం తప్పక హాజరవుతారు ఇంతకు పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు ప్రధమంగా ఇక్కడే తీయించేవారు.చెంచయ్య గారి అనంతరం అదే కుటుంబానికి చెందిన వెంకయ్యగారు ముఖమండపాన్ని కట్టించారు .ఇప్పుడు లేదు కాని 50 సంవత్సరాల పూర్వం స్వామివారి రధోత్సవం జరిగేదట.పొన్నపల్లి కోటసుబ్బయ్య  అనే ఆయన ఒక రధాన్ని ఈ గుడికి కానుకగా ఇచ్చారు .అలాంటి రధం అప్పటికి జిల్లాలోనే లేదట .తదనంతరం అది ఉప్పెనలో కొట్టుకుని పోయింది.కల్యాణోత్సవానికి అప్పట్లో పద్మశాలీలు ప్రతి సంవత్సరం మగ్గానికి పావలా చొప్పున ఇచ్చేవారట.ఇక సాంస్కృతిక కార్యక్రమాలు,నాటకాలు,కోలాటం,ఈ ఉత్సవాలకు అదనపు ఆకర్షణ.ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.ఈ దేవాలయ ధ్వజస్తంభానికి లో ఇత్తడి తొడుగు చేయించారు.ఇటీవలే ఈ దేవాలయ ప్రాంగణంలో కొండపల్లి చిట్టియ్య యజ్ఞశాల నిర్మించారు.

వంశపారంపర్యంగా ఇది గొర్రెపాటి వారి ధర్మకర్తృత్వంలో ఉంది.