చుండూరి నాగభూషణం గారి సత్రంBack to list

చుండూరి  నాగభూషణం  గారి  సత్రం

   

ఘంటసాల 13వ శతాబ్ధంలో వైశ్యుల ప్రాముఖ్యత గల పట్టణం.నేటి వైశ్యులు సామాన్య వ్యాపారస్తులుగా తోచినా ,వీరి వైభవం ఎన్నదగినది.గెల్లి వారు ,చుండూరి వారు ,సంకా వారు మన గ్రామంలో ప్రసిద్ధి చెందిన వైశ్యులు.చుండూరి నాగభూషణం గారు పాతతరం వారిలో ప్రముఖులు.1928 వ సంవత్సరంలో 6000 రూపాయల ఖర్చుతో సత్రమును కట్టించారు.మనం ఇప్పుడు పిలుస్తున్న సత్రం సెంటర్ అనే ప్రాంతం పేరు దీనివల్ల వచ్చినదే.తదనంతరం వారి కుమారుడు చుండూరి వెంకటరెడ్డి ప్రహరీగోడ ని నిర్మించి కొంత మరమ్మతు చేయించారు .ప్రస్తుతం ఇది వినియోగం లో లేదు.

గ్రామాభివృద్ధి లోను ,గ్రామరాజకీయాలలోనూ వీరి పాత్ర ప్రశంసించతగినది.ఇటీవల కాలంలో ఈ సామాజిక వర్గం నుంచి శ్ర్రీ సంకానాగబాలసుబ్రమణ్యం 1988-93 వరకు గ్రామ సర్పంచ్ గా తన సేవలని అందించారు.ఈయన హయాం లోనే 1993 లో పంచాయితి వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆ సంధర్బంగా 1918నుంచి 1993వరకు జరిగిన గ్రామాభివృద్ధి నివేదిక ని పుస్తకరూపంలో ప్రచురించారు.ఈ మధ్యకాలంలో ఈతరం యువకులంతా వృత్తి ,వ్యాపారరీత్యా వివిధ పట్టణాల్లోను,విదేశాల్లోను స్థిరపడ్దారు.మరికొంతమంది మాత్రం వారసత్వం గా వచ్చిన వ్యాపారాల్ని నిర్వహిస్తున్నారు.ఎంత దూరాలు వెళ్లినా మాది ఘంటసాల అని గర్వంగా చెప్పుకునే స్వగ్రామాభిమానులు మన వైశ్యులు.