గుర్తుకొస్తున్నాయిBack to list

 

 గుర్తుకొస్తున్నాయి

 

ఎందరో  మహానుబావులు చదివిన  స్కూల్ లో నేను చదవటం నాకు చాలా ఆనందం కలిగించే విషయం.

నాకు బాగా గుర్తు మొదటి రోజు నేను 6th A సెక్షన్ లో కూర్చున్నారమ్య అనే అమ్మాయి మా క్లాసు లీడర్.

బాగా అల్లరి చేసే అలవాటు ఉన్న నేను అదే అలవాటు స్కూల్ లో కూడా కంటిన్యూ చేశా.

నా అల్లరి చూసి మా లీడర్ నన్ను నించోమనడం నేను కోపంతో జామెంట్రీ  బాక్స్ ఆమె మీదకి విసరటం

 జరిగిపోయాయి.

పక్క క్లాసు లో ఉన్న మా నాన్న గారికి ఆమె కంప్లైంట్ చేయటం అయన నన్ను స్కేల్ తో ఒక్కటి ఇవ్వటం 

అది విరగటం ఒకే   సారి జరిగాయి. అంటేస్కూల్ లో జాయిన్ అయిన మొదటి రోజే దెబ్బలు తిన్న మొదటి స్టూడెంట్ బహుశా నేనే కావచ్చు :)

7 th క్లాసు వరకు బాగానే చదివిన నాకు మా నాన్న గారికి ట్రాన్స్ ఫర్  అవ్వగానే రెక్కలు వచ్చాయ్స్కూల్ కి రావటం Attendense వేయించుకోవటం వెళ్లి క్రికెట్ 

ఆడటం..ఇదే పని

ఇలా 2 సంవత్సరాలు గడిచాయిఇక నేను 10th లో చేరవలిసిన టైం వచ్చింది.

 రోజు నైట్ డ్రిల్ మాస్టర్ నాగేశ్వరరావు గారు ఇంకా కొంత మంది మాస్టర్స్ మా ఇంటికి వచ్చారు

నా సంగతి మా ఫాదర్ కి వివరించి ఇదే స్కూల్ లో చదివితే 1oth అవ్వటం అప్పుడు నేను ఉన్న పరిస్తితిలో కష్టం అని చెప్పడం నేను Residential కి 

వెళ్ళడం జరిగి పోయాయి. ఆ టైం లో మాస్టర్  మీద కోపం వచ్చినాఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది...ఒక వేళ నిజంగా  రోజు  బయటకి 

వెళ్ళక పొతే నేను  రోజు ఈ పోసిషన్ లో మాత్రం ఖచ్చితం  ఉండే వాడిని కాదు...

స్కూల్ వెనుక ఉన్న చెరువులో చేపలకి అన్నం వేయటంఫ్రెండ్ బాక్స్ చేరువలో వేసి నా బాక్స్ తో కొట్టడం

అమ్మాయిలని చెరువులో తోయటందొంగతనంగా డ్రిల్ రూం లో నుండి క్రికెట్ kit తీసి మూల్పూరి చెన్నారావు గారి కి బుక్ అవ్వటం...ఇలా ఎన్నో గుర్తులు...

నా  ఉన్నతి కి సాయ పడిన మాస్టర్లు నాకు గుర్తు ఉంది.. చెన్నా రావు గారు హెడ్ మాస్టర్

డ్రిల్ మాస్టర్ నాగేశ్వర రావు, DV మాస్టర్పొట్టి మాస్టర్వేమూరి కుటుంబరావు మాస్టర్వేణుకుమారి మాస్టర్

హిందీ మాస్టర్...ఇలా ఎందఱో మహాను బావులు.

.కొందరు ఉన్నారు,కొందరు పోయారు..పోయినోళ్ళు అందరు మంచి వారు...ఉన్న వాళ్ళు 

పోయినోళ్ళ తీపి గురుతులు...

ఇక  స్కూల్ నాకు ఇచిన ఫ్రెండ్స్...గొర్రెపాటి బుల్లియ్య చౌదరిచుండురి రాజేష్పరుచూరి నరేంద్ర

పాల కిరణ్ కుమార్వేమూరి వెంకట రామ కృష్ణ. ఇలా ఎందఱో..నాకు చాలా మంది అమ్మాయిల పేర్లు కూడా ఇంకా గుర్తురాస్తే బాగోదు...

అందరికీ  ఇప్పటికే పెళ్లి అయిపోయాయి..

ఇప్పటికి ఘంటసాల నుండి విజయవాడ వైపు వెళ్తుంటే ఒక్కసారి  స్కూల్ వంక చూస్తే ఏవో 

పాత మధుర జ్ఞాపకాలు..

ఊరి లోనే ఉంటే  మాత్రం ఖచ్చితంగా  ఒక్కసారి  అయినా  వెళ్లి కూర్చుని వస్తా...

 ఆర్టికల్ చదివిన మన ఊరి స్కూల్ చదివిన వారికి ఎవరికైనా ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో 

ఉంటాయి అని అనుకొంటూ...

 

 గ్రామం లోనే పుట్టి గ్రామం కే చెందిఇదే స్కూల్ లో చదివిన ఒక అల్లరి అబ్బాయి :)

 

Chitti Babu Vemuri

Accenture

Chennai

vchitti@gmail.com