జలధీశ్వరా టూరింగ్ టాకీస్ Back to list

 జలధీశ్వరా టూరింగ్ టాకీస్ 

ఇప్పుడున్న రాజ్య లక్ష్మి ధియేటర్ కంటే ముందు మన ఊరులో మరో సినిమా హాల్ ఉండేది. చాకలి బజారులో తడికలతో నిర్మించిన ఓ పాకలో ఒకే ప్రొజెక్టర్ తో సినిమాలు ప్రదర్శించేవాళ్ళు. అంటే సినిమా 14 రీళ్ళు ఉంటే ప్రతి రీలు మార్చటానికి 14 సార్లు విరామం ఉండేదన్న మాట. తర్వాత కొన్నాళ్ళకి సిమెంట్ గోడలతో అధునికీకరించారు.సినిమా టిక్కెట్ పావలా.చుట్టు పక్కల గ్రామాలనుంచి జనాలు బండ్లు కట్టుకుని సినిమాకి వచ్చేవాళ్ళు.1977 లో వచ్చిన దివిసీమ ఉప్పెన ధాటికి హాలు మొత్తం కూలిపోయింది.చాన్నాళ్ళు అక్కడ మొండి గోడలు దర్సనమిచ్చేవి.అక్కడ ఇప్పుడొక రైస్ మిల్లు కట్టారు.ఆ తరువాత 1983 లో రాజ్య లక్ష్మి థియేటర్ కట్టారు.ప్రస్తుతం అది కూడా మూతబడింది.