దేవుడు చేసిన మనుషులుBack to list

ఇప్పుడు ధియేటర్ లో అంటే కష్టమే కానీ,ఎప్పుడైనా  T.V లో దేవుడు చేసిన మనుషులు సినిమా వస్తే మాత్రం టైటిల్స్ మిస్ అవ్వకండి. సినిమా పేరు కంటే ముందు మీకొక టైటిల్ కనిపిస్తుంది ఈ కింద ఉన్నట్లు.

కృతఙ్ఞతలు

వేమూరి కృష్ణమూర్తి

ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది హీరో లు కలిసి నటించడం మనకి ఇప్పుడు కొత్త కాక పోయినా,ఇద్దరు 

సూపర్ స్టార్స్ కలిసి నటించడం అందులోను   సినిమా షూటింగ్ మన గ్రామానికి దగ్గర లో

 బందర్ లో జరగటం సినిమా కి మన గ్రామానికి చెందినా వ్యక్తి  సహాయం చేయటం యాదృచ్చికం.

సూపర్ స్టార్ కృష్ణనందమూరి తారక రామారావుజమున,జగ్గయ్య లాంటి మేటి నటులు నటించిన

అలనాటి  సిల్వర్ జుబ్లీ సినిమా "దేవుడు చేసిన మనుషులు"

అప్పటి వాళ్ళలో చాలా మందికి తెలుసు,  సినిమా climax షూటింగ్ బందర్ లోనే జరిగింది.

రామారావుకృష్ణజగ్గయ్య అందరూ  షూటింగ్ లో పాల్గొన్నారు.

L.I.C ఉద్యోగి గా పనిచేస్తూ బందరు లో నే మకాం ఉంటున్న మన గ్రామస్తుడైన కృష్ణమూర్తి గారి ఇంటినుండి రామారావుకృష్ణజగ్గయ్య కి కి బోజనాలు వెళ్ళేవి అట

అయిన వాళ్ళు అంతా  దగ్గరగా ఉంటారు అని పదవీ విరమణ అనంతరం ఇప్పుడు కృష్ణ మూర్తి గారు వాళ్ళ ఫ్యామిలీ తో ఘంటసాల లో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు

వారి ఇల్లు మన గ్రామం లో ఉన్న నాంది వాటర్ ప్లాంట్ పక్కనే ఉందిసత్యసాయిబాబా కృష్ణా జిల్లా సంఘానికి 

కృష్ణ మూర్తి గారు ప్రెసిడెంట్.

 - సేకరణ 

వేమూరి చిట్టి బాబు