





10000 సంవత్సరాల కి ఒకే కాలెండర్ గురించి మీరు ఎపుడైనా విన్నారా ? దీని రూపకర్త శ్రీ గొర్రెపాటి పార్ధ సారధి. వీరి తండ్రి గొర్రెపాటి నరసింహం మన గ్రామ వాసి. 1934 లో చల్లపల్లి జమిందారు ఆహ్వానం మేరకు పెదకళ్ళేపల్లి మరియు చుట్టు పక్కల గ్రామాలకి సముద్దారు గా నియమితులయ్యారు.(భూమి శిస్తు వసూలు చేసే వారిని సముద్దారు అంటారు.) అప్పటినుంచి పెదకళ్ళేపల్లి లో నే స్థిర నివాసం ఏర్పరుచుకుని,చుట్టుపక్కల గ్రామాల్లో గొప్ప ఖ్యాతిని సంపాదించారు. వీరికి ఇద్దరు కుమారులు.గొర్రెపాటి వెంకట నరసయ్య మరియు గొర్రెపాటి పార్ధసారధి.వెంకట నరసయ్య గారు చల్లపల్లి లో కదలీ పుర గ్రంధమాల ను స్థాపించి సాహితీ కృషి చేశారు.గొర్రెపాటి వారి చరిత్ర రచయిత కూడా ఈయనే. ఇక రెండవ కుమారుడు పార్ధ సారధి గారు ఈ కాలెండర్ సంకలనం ద్వారా గణితం పట్ల తనకున్న ప్రతిభ ని మనకి అందించారు.అంతే కాక ఈ కాలెండర్ ని ప్రామాణికం గా తీసుకుని శ్రీ కృష్ణ దేవరాయులు శ్రీకాకుళాన్ని సందర్శించిన తేది తప్పు అని నిరూపించారు.ప్రతి ఇంటి లోను ఉండి తీరాల్సిన కాలెండర్ ఇది.
Click here to download the Calendar