దాదాపు 50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో ప్రారంభించిన రుద్రభూమి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి భవనాల నిర్మాణాన్ని ప్రారంభించారు. శ్రీ వీరపనేని సుబ్రహ్మణ్యం మరియు వారి సోదరుడు ఆనంద్ చొరవతో గ్రామస్తుల భాగస్వామ్యంతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమానికి పలువురు గ్రామస్థులు, ప్రవాస గ్రామస్థులతో పాటు ఎంపి నిధులనుంచి 5 లక్షల రూపాయలు, ఎమ్మెల్సీ నిధుల నుంచి 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి.
గ్రామస్తులనుండి విరాళం గా అందే ప్రతి రూపాయికి మరొక రూపాయిని జత చేస్తూ వీరపనేని సోదరులు ఈ నిర్మాణాలని కొనసాగిస్తున్నారు. గ్రామస్తుల ద్వారా ఈ రోజుకి అందిన విరాళాల మొత్తం 860000/- కాగా,వారు అదే మొత్తాన్ని జత చేశారు. ఇప్పటికే దహన వాటిక నిర్మాణం పూర్తవగా, 20 x 50 అడుగుల వైశాల్యం తో నిర్మించనున్న మరో భవనం సగం పూర్తయ్యింది.
ఈ భవనాల నిర్మాణానికి మరో 25 లక్షల రూపాయలు అవసరమవుతాయని అంచనా. 82 సంవత్సరాల వయసు లో ఈ బృహత్కార్యాన్ని భుజస్కందాల పై వేసుకుని అహర్నిశం పాటుబడుతున్నారు శ్రీ మూల్పూరి చెన్నారావు గారు.
విరాళాలు అందించదలచిన వారు సంప్రదించండి : 08671254311