అధ్వాన్న స్థితిలో ఘంటసాల - బిరుదుగడ్డ రోడ్డు Back to list

ఈ రహదారి నుండికొన్ని వేల టన్నుల చెరుకు ట్రాక్టర్ లు,లారీలుద్వారా వెళ్ళిన రోజులుఉన్నాయి.  కాని నేడు సైకిల్ కూడా వెళ్ళలేని దుస్థితికి వచ్చింది. ఘంటసాల మండలం లోని బిరుదిగడ్డ గ్రామాని వెళ్లే ఏకైక మార్గం ఇది. గ్రామంలో ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు.ఇప్పటికే దీనిని తారురోడ్డు గా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చెయ్యటం జరిగింది. ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే అంచనా వ్యయం 2 కోట్లుగా  తయారు చేసి సంబంధిత కార్యాలయానికి కూడా పంపటం జరిగింది. కానీ ఫైల్ కదలటంలో జాప్యం జరుగుతోంది.త్వరగా నిధులు మంజూరు చేసి తక్షణం రోడ్డు నిర్మించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

 

 Dated : 12.09.2017