మీలో చాలామందికి నాకూ ప్రత్యక్ష పరిచయాలు లేకపోవచ్చు.కొంతమందిని అసలు నేను చూసి కూడా ఉండకపోవచ్చు. కొంతమందికి అసలు నేనెవరో కూడా తెలియకపోవచ్చు. కాని మూడు సంవత్సరాలుగా ఈ వేదిక మిమ్మల్నందరినీ నాకు దగ్గర చేసింది. ఇన్ని రోజులూ ఒంటరిగా సాగిన నా జీవిత ప్రయాణం 2013 ఫిబ్రవరి 14 న జంటగా మారబోతోంది. ఈ శుభవేళ మీ అందరి ఆశీస్సులు నాతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని నాకు ఆప్తుల్ని చేసిన ఇదే వేదిక ద్వారా నా వివాహానికి మీ అందరికీ ఆహ్వానం పలకటం సంతోషంగా ఉంది. ఈ ఆహ్వానం చూసిన ప్రతి ఒక్కరూ విచ్చేసి మీ ఆశీస్సులు అందచేయాలని ప్రార్ధన.
విదేశాలలో ఉండేవారు రాత్రి 7.00 PM IST నుండి LIVE లో చూసి మీ ఆశీస్సులు అందచేయగలరు.