స్మృతి స్రవంతి-గొ మహాలక్ష్మమ్మBack to list

 గొర్రెపాటి మహాలక్ష్మమ్మ గారు

గొర్రెపాటి మహాలక్ష్మమ్మ గారు,మన గ్రామంలోనే కాక ఆనాటి అభ్యుదయ రచయిత్రులలో పేరెన్నికగన్న రచయిత్రి.చరిత్రకారుడిగా వ్యక్తుల జీవిత చరిత్రలను రాయటం లో వెంకట సుబ్బయ్య గారు సిద్ధహస్తులైతే, స్త్రీ వాద రచనలలో  మహాలక్ష్మమ్మ గారు దిట్ట.మన గ్రామానికి పొరుగునే ఉన్న ఘంటసాల పాలెం వీరి పుట్టినిల్లు. పరగణా పెత్తందారు శ్రీ వేమూరి వెంకట్రామన్న గారి మనుమరాలు.ఘంటసాల గ్రామం మెట్టినిల్లు.

మహిళా సేవకురాలిగా,మహిళాభ్యుదయానికి ఎనలేని కృషి చేశారు.పంచాయితీ బోర్డు మెంబర్ గా గ్రామాభివృద్ది లో పాలుపంచుకున్నారు.రైతాంగ పోరాటం లో మహిళలను కూడా చైతన్య పరచి వారికి నాయకత్వం వహించారు.ఆంధ్ర రాష్ట్ర మహిళా సభ ని మన గ్రామం లో విజయవంతం గా నిర్వహించారు.ప్రజలలో ఆధ్యాత్మికతని పెంచే విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు.ఆదర్శ గృహిణి గా,తల్లిగా పలువురి మన్ననలందుకున్నారు.శ్రీ గొర్రెపాటి బాపనయ్య గారి సహచర్యం లో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి తాను రాసిన అమూల్యమైన గ్రంధ సంపదని మనకి విడిచి వెళ్ళిన అభ్యుదయ రచయిత్రి శ్రీమతి గొర్రెపాటి మహా లక్ష్మమ్మ గారు.ప్రస్తుతం గొర్రెపాటి వేంకటరాయలు ఉదయ భాస్కరమ్మ విద్యా ట్రస్ట్ కమిటీ సభ్యులు గా విశేషమైన సేవలనందిస్తున్న శ్రీ గొర్రెపాటి చంద్రశేఖరరావు గారు వీరి కుమారులే..

గ్రంధం :స్మృతి స్రవంతి