జలదీశ్వరాలయ కమిటి విన్నపం Back to list

 

శివ పార్వతులు ఏక పీఠము పై వెలసిన ఏకైక పురాతన క్షేత్రము శ్రీ బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామి వారి దేవాలయము పునర్వైభవము లో భాగస్వాములై అభివృద్ధికి విరాళాలు అందించండి.

 
మన ఘంటసాల గ్రామము లో ఈ  దేవాలయానికి ఎంతో పురాతన ప్రశస్తి కలిగి ,క్రీస్తు శకారంభము నుండి 15 వ శతాబ్దము వరకు అర్చకులు ,వాయిద్య కారులు, దేవదాసీలు ,దేవాలయ వివిధ కార్యక్రమ నిర్వాహకులు వందలాది మంది చే నిర్వహించబడి అపురూప క్షేత్రముగా విరాజిల్లినది.నేటికి దేవాలయము లో ఉన్న పాలరాతి శాసనములు ద్వారా విశదీకరించబడినది.భారత పురావస్తు శాఖ వారు ఈ దేవాలయము ఎంతో పురాతనమైనదని పరిశోధనల ద్వారా తెలిపి సదరు శాసనాన్ని ద్రువపర్చినారు.కాశి ,శ్రీశైలం ,శ్రీ కాళహస్తి తదితర అపురూప క్షేత్రాల యశస్సు ఏ క్షేత్రములో ఉన్నట్లు పండితుల ఉవాచ. ఇట్టి క్షేత్రమునకు పూర్వ వైభవము తేవాలని భక్తులకు ఇటివల భావన కలిగినది.
 
ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు 
 
రాజగోపుర నిర్మాణము 13 లక్షలు 
 
విమాన గోపుర పునర్ నిర్మాణము  లక్షలు
ధ్వజ స్థంబ ప్రతిష్ట  ౬ లక్షలు 
 
పూజారి గృహము ,భక్తుల గదులు ౬ లక్షలు 
 
మరియు ౧౦ లక్షలతో శ్రీ చక్రం,గర్భాలయ పునరుద్దరణ ,అంతరాలయ పునరుద్దరణ ,ఉత్తర మాడ వీధి సిమెంటు ,యజ్ఞ శాల తదితర నిర్మాణ కార్య క్రమాలు జరిగినవి.
 
ఇంకా దేవాలయానికి అవసరమైన పనులు 
 
౧) ముఖ మండప నిర్మాణము అంచనా వ్యయము ౨౦ లక్షలు.
 
౨) నవ గ్రహ మండపం (నల్ల రాయితో నిర్మాణం ) ౫ లక్షలు
 
౩) దేవాలయము ముందు సిమెంటు రోడ్డు ౫ లక్షలు 
 
౪) సుబ్రమణ్య స్వామి పుట్ట మీద స్లాబు ౧ లక్ష 
 
౫) రాజ గోపురాల నిర్మాణం.
ఉత్తర రాజ గోపురం ౧ లక్ష
దక్షిణ రాజ గోపురం ౫౦ వేలు
పశ్చిమ రాజ గోపురం ౧ లక్ష
 
౬) దేవాలయ చరిత్ర పుస్తకాలు ,దేవాలయ ప్రచారం కొరకు ముఖ్యమైన ప్రదేశాలలో హోర్డింగుల ఏర్పాటు ,

పై అభివృద్ధి కార్యక్రమాలు భక్తుల సహకారము తో ఏర్పాటు చేయవలెనని సంకల్పము.
కావున మీ విరాళాలను శ్రీ బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటి కి నేరు గా కాని లేదా ఈ వెబ్ సైట్ ద్వారా కానీ సంప్రదించి,అందించి  ఈ క్షేత్ర పునర్వైభవములో భాగస్వాములు కాగోరుచున్నాము.

ఇట్లు 
 
ఆలయ కమిటి