రజకుల రామాలయం పునర్నిర్మాణం Back to list

 

 

 

రజకుల రామాలయం 15.07.1934 న నిర్మించబడినది.మన ఊరి రజకులు కోలాటం ఆడటం లో ప్రసిద్దులు.1978 లో దేవుడు చేసిన మనుషులు చిత్రం షూటింగ్ బందరు లో జరిగినపుడు,ఒక సన్నివేశం చిత్రీకరణ రిత్యా మన ఊరు రజకులే కోలాటాన్ని ప్రదర్శించారు.ఆ ఆటకి ముగ్ధులైన నటుడు సూపర్ స్టార్ కృష్ణ వారికి పారితోషికం తో పాటుగా ఈ రామాలయం లో ప్రస్తుతం ఉన్న విగ్రహాలని బహుకరించారు.గత కొద్దికాలం గా ధర్మ కర్తల మధ్య విభేదాల కారణం గా ఈ రామాలయం నిర్లక్ష్యానికి గురి అయ్యింది.ఇటీవల గ్రామం లో జరుగుతున్న ఇతర దేవాలయాల పునరుద్దరణ స్పూర్తి తో ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు.దాదాపు 75 ఏళ్ల క్రితం నిర్మించిన డాబా పూర్తిగా శిధిలం అవటం తో దాన్ని కూల్చి వేసి నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు.కానీ రజకుల్లో ఆర్ధిక బలం ఉన్న వాళ్ళు తక్కువ గా ఉండటం తో ఈ నిర్మాణం అతి కష్టం మీద సాగుతోంది.విరాళాలు అందచేయదలచిన వారు ఈ వెబ్ సైట్ ని కానీ లేదా ఈ నంబర్ లో సంప్రదించండి.