జై స్వచ్చ భారత్ జై స్వచ్చఆంధ్రప్రదేశ్ జై జై స్వచ్చ ఘంటసాల
మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపునందుకుని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ పిలుపునందుకుని స్వచ్చచల్లపల్లి రథసారధి DR.D R K ప్రసాద్ గారి స్పూర్తితో గాంధీ జయంతి 2 అక్టోబర్ 2015 నాడు మన ప్రియతమనేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గారైన శ్రీ మండలి బుద్దప్రసాద్ గారి చేతులు మీదుగా స్వచ్చ ఘంటసాల కార్యక్రమం ప్రారంబించినాము.
గ్రామీణ ప్రాంతంలో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందో లేదో అని ప్రారంబించుటకు ముందు చాల ఆందోళన పడ్డాము .కాని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత,వితరణశీలి ,గ్రామాభివృద్దికి మార్గదర్శి,రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ మూల్పురి చెన్నారావు గారు గౌరవ అధ్యక్షులుగా విశ్రాంత ఉపాద్యాయులు,ఉద్యోగులు,ప్రస్తుత ఉపాద్యాయులు ,లాయరు.ITC కాలేజీ ప్రిన్సిపాల్ ,వ్యాపారస్తులు ,విద్యావంతులు అయిన యువకులు,చేనేత కార్మికులు, మరి కొంతమంది ప్రోత్సాహం తో ప్రారంబించిన నాటి నుండి నేటి వరకు 70 రోజులు నిర్విరామంగా స్వచ్చ ఘంటసాల కార్యక్రమం కోనసాగుచున్నది,
ప్రతి రోజు ఉదయం 5 గం నుండి 6 గంllల వరకు రోడ్డుల వెంట పిచ్చి మొక్కలు నరికి పోగు చేసి వెళ్ళేవారము.వారం రోజుల తరువాత ఆ పోగులు అక్కడే వుంటే మేమే తగలబెట్టి శుభ్రం చేసేవారము.రిక్షా అవసరం వున్న సంగతిని సామాజిక మాద్యమం లో తెలుపగా MANAGHANTASALA .NET వారు స్పందించి 12 వేలు విలువ గల సైకిల్ రిక్షా విరాళంగా ఇచ్చినారు.
ఇప్పుడు మరో సమస్య వచ్చింది. రిక్షా ఎవరు తొక్కాలి అని.అప్పుడు మా బృంద సభ్యుడైన హెడ్ మాస్టర్ పోతన వెంకటేశ్వర రావు గారు నేనే రిక్షా తొక్కుతాను అని ప్రకటించినారు.వారికి ధన్యవాదములు. ఈ విషయం మన బ్యాంకు నూతన అద్యక్షులు గారైన శ్రీ బండి పరాత్పరరావు గారికి తెలిసి పంచాయితి నుండి ఒక మనిషిని ఇవ్వమని చెప్పగా పంచాయితి వారు ఏర్పాటు చేసినారు.కావున బండి పరాత్పరరావు గారికి ధన్యవాదములు.మేము పని చేయుచున్న ప్రదేశములలోని ప్రజలు స్వచ్చందంగా వచ్చి పాల్గొని సహకరించినారు.రేపు పనిచేసే ప్రదేశం లో ఈ రోజు సాయంత్రం వెళ్లి ప్రజలను కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనమని కోరి ,వ్యక్తిగత మరుగు దొడ్డి వుందా లేదా ,వాడుచున్నార అని అడిగి,రోడ్డుపై చెత్త వేయవద్దని ,వాటివల్ల దోమలు వృద్ధి చెందుతాయని వివరించి చైతన్య పరిచేవారము.మా బృంద సభ్యులతో పాటు పంచాయితి మెంబర్లు ,మహిళలు కూడా పాల్గొనేవారు.వారికి దన్యవాదములు.ఈ కార్యక్రమం చాల వ్యయ ప్రయాసలతో కూడుకున్నది.గ్రామ పెద్దలు పెద్ద మనసుతో విరాళాలు అందించి ప్రోత్సహించినారు.వారికి దన్యవాదములు.రోడ్డుల వెంట కలుపు మొక్కలు నివారణకు మందు పిచికారి చేయుటకు గాను గ్రామంలోని ఎరువులు దుకాణదారులు కలుపు మందులు ఉచితంగా ఇచ్చినారు.వారికి దన్యవాదములు.
హరిత ఘంటసాల కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మండపం రోడ్డులో రోడ్డుకు రెండు వైపుల మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేసినాము. ఆ మొక్కలకు ప్రతి రోజు నీళ్ళు పోసి పోషించుచున్న శ్రీ వేమూరి శివరామకృష్ణ ,వేమూరి రాధాకృష్ణ మరియు స్థానికులకు దన్యవాదములు.ఇదే స్పూర్తితో గ్రామం మొత్తం మొక్కలు నాటాలని మా బృందం నిర్ణయించి పటమట బజారులో మొక్కలు నాటినాము.మ్యుజియం బజారులో నాటుటకు ప్రణాళిక సిద్దం చేస్తున్నాము.
మెయిన్ రోడ్డులో వ్యాపార కూడలిలో డస్ట్ బిన్ ఏర్పాటు చేయుటకు వ్యాపారస్తులను సహకరించమని కోరినాము.ప్లాస్టిక్ డబ్బాల పంపిణి త్వరలోనే చేపడుతున్నాము .ఘంటసాల గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చ్జిదిద్దుటకు గ్రామ ప్రజలందరూ సహకరించమని కోరుచున్నాము.
కుమ్మరిగుంట చెరువులో స్థానికులు చెత్త వేయుట వలన ఆ ప్రాంతం దుర్గందంగా వున్నది.మేము ఆ చెత్తను తీసివేసి ముళ్ళ కంపను నరికి చెరువు కట్టలు శుభ్రం చేసినాము.వేసవి కాలము నీరు-చెట్టు కార్యక్రమము క్రింద చెరువు త్రవ్వి కట్టలు సరిచేసి చెరువు చుట్టూ మొక్కలు నాటలని “మినీ ట్యాంక్ బండ్” గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినాము.
మన ఊరి పార్కు గోడ బయట ఖాళీ ప్రదేశం లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా మొక్కలు నాటాలని గ్రామ పెద్దలని , దాతలను కోరినాము.
దాతల సాయాన్ని గ్రామాభివృద్ది కోసం తీసుకొనుటకు ట్రస్ట్ ప్రారంబించాలని DR.D R K ప్రసాద్ గారి సూచనతో ట్రస్ట్ పేరు సూచించమని కోరిన మీదట గ్రామస్తులు ,NRI లు ,ఉన్నత విద్యావంతులు ఎక్కువ మంది మన ఘంటసాల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినాము.దీనిని గూర్చి శ్రీ రంగ నాధ బాబు గారితో చర్చించమని మూల్పురి చెన్నారావు గారిని కొరటమైనది.దాత సాయాన్ని అంది పుచ్చుకుని ఘంటసాల గ్రామాన్ని స్వచ్చ ఘంటసాలగా తీర్చిదిద్దుతాము.
ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినను,కొంత మంది ఎగతాళి చేసినను వెరవక ప్రతి నిత్యం పాల్గోనుచున్న కార్యకర్తలకు దన్యవాదములు.వారి కుటుంబ సభ్యులకు మరీ మరీ దన్యవాదములు.
గ్రామ సర్పంచ్ గారు,మిగిలిన మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని ,గ్రామ ప్రజల పక్షాన కోరుచున్నాము.
ఇట్లు
గొర్రెపాటి సురేష్,
కన్వీనర్, స్వచ్చ ఘంటసాల.
dated : 10.12.2015