ఇంటికో మొక్కBack to list

 ఘంటసాల గ్రామస్తులందరికీ విన్నపం

హరిత ఘంటసాల కార్యక్రమంలో భాగంగా తొలివిడతలో మెయిన్ రోడ్డు నుండి కళ్యాణమండపం వరకు ఇరువైపులా చెట్లు నాటాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క , దాని పరిరక్షణ కోసం ట్రీ గార్డులని విరాళంగా ఇవ్వాలని మన గ్రామ యువతకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక మొక్క , ఒక ట్రీ గార్డుని ఇవ్వటం ద్వారా హరిత ఘంటసాలలో భాగస్వాములు కావాలని మా వినతి. మన లక్ష్యం 100 మొక్కలు నాటడం. ఒక్కో మొక్కకి 700 రూపాయలు ఖర్చు అవుతోంది. 100 మంది ఒక్కోక్క మొక్క చొప్పున ఇస్తే మన హరిత ఘంటసాల కల సాకారమవుతుంది. మీరు ఆ 100 మందిలో ఒకరు కావాలని ఆశిస్తున్నాము.ఈ పోస్ట్ కింద కామెంట్ చెయ్యటం ద్వారా మీ మద్దతు తెలియచేయగలరు. ఈ పోస్ట్ ఘంటసాల గ్రామస్తులందరికీ చేరేలా షేర్ చెయ్యండి. నేరుగా ఇవ్వదలచిన వారు సంప్రదించండి. గొర్రెపాటి సురేష్ , ఉప సర్పంచ్, ఘంటసాల.+918500320261

 

 

 

dated : 30.07.2015