వందేళ్ళ నాటి పంచాయితీ తీర్మానంBack to list

పంచాయితీ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సంధర్భంలో , ఆ ఏర్పాటు వెనుక ఉన్న ఎన్నో ఆసక్తి కరమైన అంశాలు ఉన్నాయి. అధికారికంగా ఏప్రిల్ 18.04.1918 న పంచాయితీ పాలన ప్రారంభమైనా దీనికి సంభందించిన తీర్మానం మాత్రం రెండేళ్ళకి ముందు అంటే జనవరి 15 , 1916 న ​జరిగింది.ఈ తీర్మానం జరిగిన చల్లపల్లి బంగ్లా ఇప్పటికీ గ్రామంలో అలాగే ఉంది ( ఫోటో చూడండి) గొర్రెపాటి బాపనయ్య గారి ఇంటి ఎదురుగా వున్న , బంగళా లక్ష్మీ నారాయణ ( గొర్రెపాటి ) గారి ఇల్లు ఒకప్పుడు రాజా గారి బంగాళా. ప్రస్తుతము దానిలో mother help land సంస్థ కాన్వెంట్ నడుపుతోంది.  

 

ఈ ఇంట్లోనే 102 సంవత్సరాల క్రితం ఘంటసాల మరియు ఘంటసాల పాలెం గ్రామాలకి కలిపి ఒకే పంచాయితీ ఉండాలని తీర్మానం చేశారు.అప్పటి వార్తని ప్రచురించిన ఆంధ్ర పత్రిక ఒరిజినల్ ప్రతి మన శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు సేకరించి మనకి అందించారు.15 వ తేదీన తీర్మానం జరిగితే ఆ వార్త ప్రచురితమవ్వటానికి 5 రోజులు పట్టింది. అప్పట్లో సమాచార వ్యవస్థ అలా ఉండేది. ఆ సమాచారం యధాతధంగా ఇక్కడ ఉంది.

అయితే పంచాయితీ ఏర్పడిన 20 ఏళ్ళకి 1938 లో వేమూరి నాగయ్య గారు ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో పాలెం వారు కోర్టు కి వెళ్లటంతో ఘంటసాలపాలెం పంచాయితీ వేరుపడింది.

 

 

 

 

 Dated : 15.01.2018