మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటుBack to list

ఘంటసాల మహాత్మా గాంధీ జిల్లాపరిషత్ హైస్కూల్ ముందు 2 లక్షలతో గాంధీ విగ్రహం ఏర్పాటు సన్నాహం.150 వ గాంధీ జయంతి ఉత్సవాలలో భాగంగా , గాంథీ 90 ఏళ్ల క్రితం ఘంటసాలలో ప్రసంగించిన ప్రదేశానికి సమీపంలో , మహాత్మా గాంధీ జిల్లా పరిషత్ హైస్కూల్ ముందు 2 లక్షల ఖర్చుతో గాంధీ ప్రసంగించే భంగిమతో నిర్మించే విగ్రహానికి ప్రదేశం నిర్ణయించారు .ఇది కేవలం హైస్కూల్ పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మాణం గావించాలని భావించి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సహకారం కోరటమైనది. ఒక్కొక్కరి నుండి 10000 రూపాయల లోపు కానీ అంతకు మించి విరాళాలు స్వీకరించబడవు. లేదా మీరు చదివిన సంవత్సరం బాచ్ పేరుతొ మొత్తం అందరూ కలిపి ఒక మొత్తంగా ఇవ్వవచ్చు.ఇందుకు ఎటువంటి పరిమితి లేదు. 2 లక్షల రూపాయలు సమకూరిన వెంటనే విరాళాల స్వీకరణ ఆపివేయబడుతుంది.అక్టోబర్2 న మండలి బుద్ధప్రసాద్ గారి చే శంకుస్థాపన జరుగును. ఈ కార్యక్రమం లో భాగస్వాములు అవ్వాలనుకునే హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఈ నెంబర్ ని సంప్రదించండి. +919985463899.లేదా info@managhantasala.net కి మెయిల్ పంపగలరు. మీ డొనేషన్ ని నేరుగా ఈ బాంక్ అకౌంట్ కి పంపవచ్చు. ట్రాన్స్ఫర్ రిమార్క్స్ లో GANDHIJI అని పెట్టటం మర్చిపోవద్దు. గమనిక : ఈ కార్యక్రమం లో భాగస్వాములవ్వాలంటే మీరు ఘంటసాల హైస్కూల్ పూర్వ విద్యార్థులై ఉండాలి. 

 

Account Name : Managhantasala Trust
Account Number : 35621977550
Bank : State Bank of India
Branch : Ghantasala
IFSC Code : SBIN0011993
 
Dated : 24.09.2018