బౌద్ధ పర్యాటకానికి ప్రోత్సాహంBack to list

దుబాయ్ లో పర్యటిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మన ఘంటసాల.నెట్ ఎడిటర్ రాజేష్ వేమూరి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మనఘంటసాల. నెట్ ద్వారా ఘంటసాల చరిత్రని విశ్వవ్యాప్తం చేస్తునందుకు అభినందించి ఘంటసాల కి టూరిస్టులు బాగా వస్తున్నారా అని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల గ్రామంలో మంజూరు అయిన బుద్ధ విహార్ ప్రాజెక్ట్ గురించి చంద్రబాబుకి కృతఙ్ఞతలు తెలిపి , గ్రామానికి బౌద్ధ పర్యాటక కేంద్రంగా మరింత ప్రాచుర్యం కల్పించాలని కోరారు. ఘంటసాల శిల్పాలు పారిస్ మ్యూజియం లో ఉన్నాయని చెప్పగానే ఆశ్చర్యపోయి, ఆ మ్యూజియం పేరు ని అడిగి తెలుసుకున్నారు. తాను లండన్ వెళ్ళినపుడు అమరావతి శిల్పాలు అక్కడి మ్యూజియం లో చూశానని, పారిస్ లో ఉన్న విషయం తనకి తెలియదని అన్నారు. ఘంటసాల తో పాటు అమరావతి, భట్టిప్రోలు శిల్పాలు కూడా పారిస్ గుయమేట్ మ్యూజియం లో ఉన్నాయని చెప్పగానే, దానికి సంభందించిన డాక్యుమెంట్ ని సమర్పిస్తే ప్రభుత్వం తరపున అధికారిక గుర్తింపు ని ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బౌద్ధ క్షేత్రాల్లో ఘంటసాల క్షేత్రమే పెద్దది, అలాగే తోలి బౌద్ధ మ్యూజియం కూడా ఘంటసాలలోనే ఉంది అని చెప్పగానే, తప్పకుండా బుద్ధ పర్యాటక ప్రాంతాలకి విశేష ప్రాముఖ్యం కల్పిస్తున్నామని అందులోనూ అమరావతి కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘంటసాలకి మరింత ప్రాచుర్యాన్ని కల్పిస్తామని అన్నారు.

 

Dated : 22.10.2017