100 అడుగుల బుద్ధ విగ్రహంBack to list

నవ్యఆంధ్రప్రదేశ్ లో బౌధ్ధ పర్యాటక ప్రాజెక్టులకి మన గ్రామంలోనే తొలి అడుగు పడింది. 100 అడుగుల ఎత్తులో తధాగతుని మహాపరినిర్యాణ భంగిమలో బౌద్ధ విగ్రహాన్ని నెలకొల్పటానికి రాష్ట్ర పర్యాటక శాఖ పచ్చ జెండా ఊపింది. హైస్కూల్ పక్కన ఎకరంన్నర విస్తీర్ణంలో ఈ ప్రతిమని ఏర్పాటు చెయ్యటంతో పాటు పార్కుని కూడా అభివృద్ధి చేస్తారు. మొత్తం అంచనా వ్యయం కోటీ యాభై లక్షలు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రాజెక్ట్ కి అవసరమైన ఎకరంన్నర స్థలాన్ని మన శ్రీమంతుడు శ్రీ గొర్రెపాటి రంగనాధ్ బాబు గారు ప్రభుత్వానికి ఉచితంగా అందించారు. మన శాసన సభ్యులు, ఉపసభాపతి  శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అవిశ్రాన్తంగా కృషి చేసి ఈ ప్రాజెక్ట్ ని మంజూరు చేయించటం జరిగింది.వచ్చే ఏడాది బుద్ధ పూర్ణిమ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకులు పోటెత్తున్న ఘంటసాల గ్రామానికి ఇది మరో మణిహారంగా మారుతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇందుకు కృషి చేసిన బుద్ధ ప్రసాద్ గారికి , స్థల దాత శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారికి కృతఙ్ఞతలు.. 

 
​ఫోటో : ప్రాజెక్ట్ నమూనా ​