వ్యవసాయ పాలిటెక్నీక్ కి లక్ష విరాళంBack to list

మన గ్రామానికి చెందిన శ్రీ వేమూరి రామస్వామి గారు ( దుబాయ్ ) గ్రామంలో ఉన్న వ్యవసాయ పాలిటెక్నీక్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకై లక్ష రూపాయల్ని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ యార్లగడ్డ వరప్రసాద్ గారికి అందచేశారు. గత ఏడాదిగా విద్యార్థులు సరైన డైనింగ్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతుండటంతో గ్రామానికి చెందిన శ్రీ దోనేపూడి రవిశంకర్ ఈ విషయాన్ని రామస్వామి గారి దృష్టికి తీసికెళ్ళటం జరిగింది. ఈ లక్ష రూపాయలతో  డైనింగ్ టేబుల్స్ మరియు చైర్స్ ని సమకూర్చుకోవటం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది అందరూ రామస్వామి గారికి  తమ కృతజ్ఞతలని తెలియచేశారు. ​ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన శ్రీ దోనేపూడి రవిశంకర్ కి కూడా రామస్వామి కృతజ్ఞతలు తెలియచేసారు. 

రామస్వామి గారు  ఈ వితరణని గోప్యంగా ఉంచమని కోరినా,మాకున్న బాధ్యత తో అలాగే  గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు ప్రకటించటం జరిగింది.ఈ స్పూర్తితో మరికొందరు గ్రామాభివృద్ధికి ముందుకు రావాలని మా కోరిక. 

 

తూర్పు కృష్ణా జిల్లా లో వున్న ఏకైక వ్యవసాయ పాలిటెక్నిక్ మన ఘంటశాల గ్రామం లో ఏర్పాటు అవ్వడం మన గర్వకారణం. మరో ప్రాంతానికి ఈ కళాశాల వెళ్లకుండా యుద్ధ ప్రాతిపదికన మన గ్రామంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉపసభాపతి  శ్రీ మండలి బుద్ధప్రసాద్ చొరవతో ఈ కళాశాల మంజూరు చెయ్యటం జరిగింది.  కృష్ణాజిల్లాలో ఉన్న రెండు వ్యవసాయ పాలిటెక్నీక్ కళాశాలల్లో ఒకటి గరికపర్రు లో ఉంటే మరోటి మన ఘంటసాలలో ఉంది.గత సంవత్సరం మన గ్రామానికి మంజూరు అయిన ఈ కళాశాలకు మౌలిక వసతుల్ని తాత్కాలిక ప్రాతిపదికన మండల కార్యాలయాలకి దగ్గరలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేశారు. దీనికి శాశ్వత ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి మరో నాలుగు సంవత్సరాల కాలం పట్టవచ్చు. అప్పటివరకు అవసరమైన వనరుల్ని వదాన్యులు కల్పిస్తే విద్యార్థుల చదువుకి సహాయపడిన వాళ్లవుతారు. వ్యవసాయం కుంటుపడుతున్న ఈ కాలంలో ఇలాంటి కోర్సుల్ని ప్రోత్సహించటం ద్వారా అన్నదాతల అభివృద్ధికి ఇతోధికంగా సహాయపడవచ్చు. డాక్టర్ యార్లగడ్డ వరప్రసాద్ ప్రిన్సిపాల్ , వ్యవసాయ పాలిటెక్నిక్ ,cell 9704550815

 
Dated : 04.08.2017