ఇది శతాబ్ది సంవత్సరంBack to list

 ఘంటసాల పంచాయితీ కి ఇది శతాబ్ది సంవత్సరం. 


99 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన గ్రామ పంచాయితీ ఏర్పడింది. తొలి పంచాయితీ బోర్డు అధ్యక్షుడు గా శ్రీ వేమూరి వెంకయ్య గారు ప్రమాణ స్వీకారం చేశారు. 1918 నుండి 1934 దాకా ఉన్న పంచాయితీ బోర్డు కి తోలి చైర్మన్ వేమూరి వెంకయ్య గారు, వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకయ్య గారు.16 సంవత్సరాల పాటు ఈ ఎన్నిక ఏకగ్రీవమే.అప్పట్లో ఘంటసాల పాలెం కూడా ఒకే పంచాయితీ కింద ఉండేది. 1934 లో ఘంటసాల పాలెం వారికి అవకాశం కల్పించే విషయంలో ఆ గ్రామానికి చెందిన వేమూరి నాగయ్య గారిని చైర్మన్ గా ఎన్నుకున్నారు.ఆ కాలంలో నే ముఠా తగాదాలు జరిగి పాలెం వారు వేరే పంచాయితీ కావాలంటూ కోర్టుకెక్కడంతో ఘంటసాల పాలెం పంచాయితీ వేరు పడింది.